తెలంగాణలో వరుసగా రెండు రోజుల నుంచి వైఎస్ షర్మిల కేంద్రంగా రాజకీయం రంజుగా నడుస్తోంది. ఆమె పాదయాత్రపై దాడికి పాల్పడిన నాటి నుంచి రాజకీయం ఆమె చుట్టే తిరుగుతోంది. వైఎస్ షర్మిల జగన్ వదిలిన బాణం కాదు బీజేపీ వదిలిన బాణమంటూ టీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. దీనిని ఖండించకుండా బీజేపీ కూడా షర్మిలకు మద్దతు పలుకుతోంది. షర్మిల ను బేస్ చేసుకొని టీఆర్ఎస్ – బీజేపీ ల మధ్య బుధవారమంతా మాటల యుద్ధం కొనసాగింది.
ప్రజా ప్రస్థానం పేరిట వైఎస్ షర్మిల మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. అయినా ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడు ఆమె చుట్టూ ఉండే లీడర్లే నిత్యం కనిపిస్తున్నారు. మొదట్లో కొంత మీడియా కవరేజ్ ఇచ్చినా ఆమె పాదయాత్రకు ఆదరణ ఉండటం లేదని గ్రహించి మీడియా కూడా గుడ్ బై చెప్పేసింది. దాంతో షర్మిల రూట్ మార్చింది. టీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా ఘాటు విమర్శలు, ఆరోపణలు చేయడం ప్రారంభించింది. ఎమ్మెల్యేలు, మంత్రులను పరుషపదజాలంతో తిట్టేసింది. అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని నర్సంపేటకు వచ్చేసరికి టీఆర్ఎస్ నేతలు తిరగబడి ఆమె పాదయాత్రపై దాడి చేశారు.
Also Read : ఫైనల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు తెరపైకి తెచ్చిన ఈడీ
ఇదే అదునుగా భావించిన షర్మిల రాజకీయం స్టార్ట్ చేశారు. ప్రగతి భవన్ వద్దకు వెళ్లి సీన్ చేసేసింది. అయితే ఇదంతా టీఆర్ఎస్ ఎంకరేజ్ మెంట్ వల్లే జరిగిందని మంగళవారం నాటి పరిణామాలను గమనిస్తే అర్థం అవుతుంది. అవసరమైన సమయంలో రాజకీయ ప్రత్యర్ధులకు ఎలివేషన్ ఇవ్వడం టీఆర్ఎస్ అలవాటు. ఇందులో భాగంగా రెండు రోజులపాటు షర్మిలకు మైలేజ్ వచ్చేలా టీఆర్ఎస్ చెసిందని అంటున్నారు.
ట్విస్ట్ ఏంటంటే.. వైఎస్ షర్మిలకు బీజేపీ మద్దతు ఇస్తోంది. ఆమె విషయంలో సర్కార్ వ్యవహారశైలిని ఖండించింది. గవర్నర్ సైతం షర్మిలకు బాసటగా నిలిచారు. ఈ క్రమంలోనే తన పట్ల వ్యవహరించిన తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళనున్నారు షర్మిల. అనూహ్యంగా వైఎస్ షర్మిలకు బీజేపీ మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది. షర్మిలకు మద్దతుగా కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంటుంది. కాబట్టి ఆ ఓటు బ్యాంక్ ను ఆకర్షించడం కోసం షర్మిలకు బీజేపీ మద్దతు ఇచ్చి ఉండొచ్చు. ఇక టీఆర్ఎస్ ఎలివేషన్ ఇవ్వడానికి ప్రధాన కారణం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ ను చీల్చడం కోసం షర్మిలకు ఓ రేంజ్ లో మైలేజ్ ఇచ్చినట్లు అర్థం అవుతోంది.
Also Read : కేసీఆర్ ‘ముందస్తు’ సంకేతాలు