‘నాటు నాటు’ తెలుగు పాటకు ఆస్కార్ రావడంతో భారతావని పులకించింది. బాగానే ఉంది. ఈ అవార్డు కడుపు నిండిన వాడికి సంతోషం కలిగించినా, కడుపు కాలుతున్న మన తెలుగు సినీ పేద కార్మికలకు మాత్రం సంతోషం కలిగించ లేదు. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని మనలాంటి పేద దేశాలకు ఇలాంటి అవార్డు లు పట్టవు.
ప్రభుత్వం కొలువుతో కడుపు నిండిన దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘భావ కవిలు’ రాసి ఊహల్లో విహరించేవారు. కొలువు లేక కాలే కడుపు తో తిరిగే శ్రీ శ్రీ రగిలిపోయి ‘ఆ కవితలు ఎవడికి కావాలి? కార్మికుల కష్టాల గురించి ఆలోచించు దేవులపల్లి’ నిని ఎన్నోసార్లు ఎద్దేవా చేసేవారు. అందుకే శ్రీ శ్రీ మహా కవి అయ్యారు.
ఈ అవార్డు ల కోసం రాజమౌళి నిర్మాతలతో పెట్టించిన ఖర్చు తడిసి మోపెడు అయ్యింది. ఇప్పటివరకు దాదాపు రూ. 120 కోట్లు. అంటే ఈ డబ్బుతో దాదాపు 120 చిన్న సినిమాలు తీయవచ్చు. కొన్ని వేల మంది తెలుగు కార్మికులకు పని దొరికేది. 100 సినిమా ధియేటర్ లు నిండేయి. 50 కోట్ల జనం 120 కొత్త తెలుగు సినిమాలు చూసి ఆనందించే వాళ్లు. ఓ ఏడాదికి వచ్చే సినిమాలకు ఈ సంఖ్యా సరిసమానం.
ఇదే రోజు మన దేశానికి చెందిన ‘ది ఎలిఫెంట్ విష్పెరేర్స్’ షాట్ ఫిల్మ్ క్యాటగిరిలో ఉత్తమ చిత్రంగా తొలిసారి ఆస్కార్ అవార్డు సంపాదించుకుంది. కానీ ఈ సినిమా దర్శక, నిర్మాతలు అప్లికేషను ఫీజు తప్పా నయాపైస ఖర్చు చేయలేదు. ఆ మాటకొస్తే ప్రమోషన్ గురించి అస్సలు పట్టించుకోలేదు. మన సినిమా బాగుంటే ఆస్కార్ అవార్డు దానికదే వెతుంటూ వస్తుంది అనే ధిమాతో ఉన్నారు. అసలు ఈ సినిమా పోటిలో ఉన్నదని చాలా మందికి తెలియదు. వాళ్లు కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఫ్రీ పుబ్లిసిటీ కూడా చేయలేదు. ధీమా అంటే అలా ఉండాలి.
సుప్ర సిద్ద దర్శకుడు సత్యజిత్ రే కి కూడా లైఫ్ టైం అచ్చివ్మెంట్లో ఆస్కార్ అవార్డు వచ్చింది. దానిని అందుకోడానికి అమెరికా రావాలని ఆస్కార్ కమిటి కోరింది. అయితే అప్పట్లో విమానం చార్జీలు మీరే పెట్టుకోవాలి అని చెప్పారు. అంటే దాదాపు లక్ష రూపాయలు. ఆ డబ్బు నేను దాచుకుంటే నా ఆరోగ్యం బాగుచేసుకోడానికి ఉపయోగపడుతుంది, ఆస్కార్ వస్తే నాకేం ఉపయోగ పడుతుంది? వద్దు. నేను రాను, దానిని కొరియర్లో మా ఇంటికి పంపండి’ అని ఆసుపత్రిలో చేరారు. అదీ ఓ కళాకారుడి వ్యక్తిత్వం. ‘విషయం’ ఉంటే తమ సినిమాకు తప్పక ఆస్కార్ అవార్డు వస్తుంది అనే నమ్మకం. పుబ్లిసిటీ వల్ల అవార్డు లు రావు. మన పేరు నలుగురికి తెలుస్తుంది.
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కి రూ. 120 కోట్లు ఖర్చు అయ్యాయి. ఈ డబ్బుతో తెలుగు సినిమాలోని పేద కార్మికులకు ‘ఆర్ ఆర్ఆర్ పేరుతో’ ఓ కాలని కట్టించినా కొన్ని వేల మంద సినిమా పేద కార్మికుల సింగల్ బెడ్ రూమ్ ఇల్లు దక్కేవి అని ఫిల్మ్ నగర్లో పేదలు వాపోతున్నారు. పనిలేక అల్లాడుతున్న పేద సినీ కార్మికులను నెలకు రూ. ౩౦౦౦ పెన్షన్ ఇచ్చినా కొన్ని వేలమందికి ఉపయోగపడేది. అవార్డు లు అగ్ర దేశాలకు కావాలి. మనలాంటి పేద దేశాలకు కాదు.
ఈ సంధర్బంగా బుచ్చిబాబు రాసిన ‘చివరికు మిగిలేది’ అనే నవల గుర్తుకు వస్తుంది. అందులో హీరో కూడా హంగులకు, అర్బాటాలకు పోతాడు. దశ దిన కర్మలకు, పిండ ప్రధానాలకు ఆస్తి మొత్తం తగలేసి నలుగురిలో పేరు సంపాదిస్తాడు. అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటాడు. కానీ చివరికి పేదవాడిగా మారతాడు. అందర్నీ దేహీ అని అర్తిసాడు. అప్పుడు వాళ్ళు ‘నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాకు సహాయం చేయలేదు. కనీసం మన ఉరికి చెరువు కట్టించి మేలు కూడా చేయలేదు. నీకు ఎందుకు సహాయుం చేయాలి?’ అని నిలదీస్తే జవాబు దొరకదు. గోపిచంద్ రాసిన ‘అసమర్థుడి జీవిత యాత్ర’ కూడా దాదాపు ఇలాంటి సందేశం ఇస్తుంది. మన గొప్ప టాలెంట్ నలుగురి కడుపు నింపాలి. కానీ పేరు ప్రతిష్టలతో సరిప్తెట్ట వద్దు.
మనకు అవార్డు లు రావాలి. కానీ ఉచితంగా రావాలి. వెతుక్కుంటూ రావాలి. మంచి ఫాంలో ఉన్న దర్శకుడు రాజమౌళి ఆ రూ. 120 కోట్లు తెలుగు సినిమా పేద కార్మికుల కోసం ఖర్చు చేసి ఉంటే, పేదవాడి దివేనలతో కనీసం కొన్ని వందల ఆస్కార్ అవార్డు లు దక్కేవిగా?
Also Read : ‘ఆర్ఆర్ఆర్’ కు ఆస్కార్ అవార్డ్ – ఎన్టీఆర్ ను అవమానించిన బాలయ్య