మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ ను చూసిన వారికీ మునుపటి మెగాస్టార్ గుర్తుకువచ్చినట్లు అనిపిస్తుంది.మెగాస్టార్ కామెడీ, డ్యాన్స్ , ఫైట్స్ తో కూడిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పీక్స్ స్టేజ్ కు తీసుకెళ్ళింది.
చిరంజీవి హీరోగా గతంలో వచ్చిన ఆచార్య , గాడ్ ఫాదర్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. చిరు నుంచి మంచి హిట్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ‘వాల్తేరు వీరయ్య’ అభిమానుల అంచనాలను అందుకునేలా కనిపిస్తోంది. అభిమానుల పల్స్ ను పసిగట్టిన దర్శకుడు చిరంజీవి ప్రమోట్ చేసి చూపించారు.
Also Read : చిరుతో స్లివ్ బ్లౌజ్ తో కష్టంగా అనిపించిందన్న శృతి హసన్
తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ లో చిరంజీవి డైలాగ్ రవితేజ , రవితేజ డైలాగ్ చిరంజీవి చెప్పడం ఫన్నీగా అనిపించింది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు విజిల్స్ వేయిస్తాయి. ఇకపోతే ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ ని సొంతం చేసుకుంటుంది.
ట్రైలర్ విడుదల చేసిన 15 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ రావడంతో కొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. రెండు గంటల్లోనే ఈ ట్రైలర్ ఏకంగా 2.6 మిలియన్ల వ్యూస్ అందుకొని నయా రికార్డ్ సృష్టించింది. నేటి తరం హీరోలకు కూడా సాధ్యం కాని రీతిలో మెగాస్టార్ కొత్త రికార్డ్ లను నెలకొల్పుతున్నారు.