రాజకీయాల్లో స్వార్థపరులే కాదు, నిస్వార్థ పరులు కూడా ఉంటారు. పొతే చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళను ప్రజలు మర్చిపోరు. ‘మీరే మా నాయకులుగా వచ్చి మమ్మల్ని కాపాడాలని’ వేడుకుంటారు. అలాంటి అరుదైన సంఘటన మన దేశంలో చాలా తక్కువగా జరిగాయి. ‘మీరు రాజకీయాల లోకి మీరు రావాలి’ అని అన్నా హజారేని ప్రజలు ఒత్తిడి చేశారు. అలాగే కేజ్రివాల్ ని కూడా రాజకీయాల్లోకి రావాలని మొదట్లో ప్రజలు ఒత్తిడి తెచ్చారు.
సరిగ్గా అలాంటి అరుదైన సంఘటన మక్తల్ నియోగాక వర్గంలో జరిగింది. ‘అసమర్థుల, అవినీతిపరుల చేతిలో బంధి అయిన మక్తల్, దేవరకద్ర నియోజకవర్గంల సంకెళ్ళు తొలగించి, ఈ నియోజక వర్గాల పూర్వ వైభవం కోసం మీరు మళ్ళి రావాలి’ అని సీతాదయాకర్ రెడ్డి విరాభిమనులు వాల్ పోస్టర్ లు అతికించారు. దాని మీద ఆ దంపతుల ఫోటోలు ఉన్నాయి. కానీ అది ఎవరు అతికించారో, వాళ్ళ పేర్లు, ఊరు లేవు. ఎందుకు అతికించారో మాత్రం తెలిసింది.
చాలా కాలంగా ఆ రెండు నియోజకవర్గాలు ఎలాంటి అభివృద్ధి లేదు. ప్రజలు అన్ని రంగాల్లో వెనకబడి, అన్నమోరామచంద్ర అని ఉపాది కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్ళుతున్నారు. భూములు కోల్పోయిన రైతులు కూలీలుగా మారారు. చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
లోగడ సీతాదయాకర్ రెడ్డి అతని భార్య మక్తల్, దేవరకద్ర నియోజకవర్గంలకు ఏమ్మేల్లెలుగా ఓ వెలుగు వెలిగారు. వాళ్ళ హయాంలో ఈ రెండు నియోజకవర్గాలు మునుపెన్నడూ చూడని ప్రగతి చూసింది. అటు పారిశ్రామికంగా, ఇటు వ్యవసాయ రంగంలో జోడెడ్ల బండిలా పరుగులు తీశాయి. ప్రజలలో ‘పెద్ద రాయుడు’లా పేరు సంపాదించారు.
ఆ తర్వాత కుటిల రాజకీయాలకు వాళ్లు ఓ దండం పెట్టి పదవులకు దూరంగా ఉన్నారు. వాళ్లు లేని లోటు అక్కడి ప్రజలకు కొట్టొచ్చినట్లు తెలిసింది. ఒక మనిషి దూరం అయ్యినప్పుడే అతని విలువ తెలుస్తుంది. ఇక్కడా అదే జరిగింది. అందుకే ఈ దంపతులు మళ్ళి రాజకీయాల్లోకి రావాలని ఇలా వాల్ పోస్టర్లు అతికించారు. అయితే వాళ్ళు ఏ పార్టీలో చేరాలో అభిమానులు చెప్పలేదు. పార్టీ ఏదయినా వాళ్ళు ఏమ్మేల్లెలుగా మారితే తమ బతుకులు బాగుపడ తాయని వాళ్ళ ఆరాటం. చిరంజీవి, బాలకృష్ణ, అనుష్క, తమన్నాలకే కాదు, సీతాదయాకర్ రెడ్డి దంపతులకు కూడా అభిమానులు ఉంటారని రుజువయింది. అల్ డి బెస్ట్.
Also Read : పవన్ కళ్యాణ్ కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఆఫర్..!