అనుకున్నదే జరిగింది. మునుగోడు టీఆరెఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం వైపు గులాబీ అధినేత కేసీఆర్ మొగ్గు చూపారు. పోటీకి కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య గౌడ్ లు ఆసక్తి చూపిన కేసీఆర్ మరోసారి కూసుకుంట్లకే ఛాన్స్ ఇవ్వడం చర్చనీయంశంగా మారింది. మునుగోడులో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న కూసుకుంట్లకు గెలుపు అవకాశాలు లేవని ఆ మధ్య పీకే సర్వేలో కూడా తేలింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక కేసీఆర్ ప్రైవేట్ సర్వే సంస్థలతో మునుగోడులో సర్వే చేయించినా ఇదే ఫలితం పునరావృత్తమైంది. అయినప్పటికీ కూసుకుంట్లనే టీఆరెస్ అభ్యర్థిగా బరిలో నిలపడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
మునుగోడులో ఇక కూసుకుంట్ల పని అయిపోయినట్టేనని పీకే సర్వే మొదలు నిన్నమొన్నటి ప్రైవేట్ సర్వే సంస్థలు తెల్చేశాయి. ఇక , ఆయన టీఆరెస్ లో నామమాత్ర నేతగా కొనసాగాల్సి ఉంటుందని అంత భావిస్తుండగా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నిక టీఆరెస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ప్రకటించారు. మునుగోడులో ఆయనకు గెలుపు అవకాశాలు లేవని,కేసీఆర్ చరిష్మా మాత్రమే కొంత ఓటు బ్యాంక్ ను సంపాదించి పెడుతుందని సర్వే టీంలు నివేదించగా.. ఏ ధీమాతో, ఎవరి కోసం కూసుకుంట్లను బరిలో నిలిపి బలి చేయడానికి కేసీఆర్ సంసిద్దత వ్యక్తం చేశారనేది హాట్ టాపిక్ గా మారింది. మునుగోడు బరిలో నిలిచేందుకు బూర నర్సయ్య వంటి ఓటు బ్యాంక్ కల్గిన నేతలు ఆసక్తి చూపినా కూసుకుంట్ల వైపే ఎందుకు కేసీఆర్ కరుణ చూపారన్న దానిపై సంచలన అభిప్రాయాలూ వెలుగులోకి వస్తున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి దక్షిణాదిలో బలపడాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇందుకోసం ఆయన కేసీఆర్ ఫ్యామిలీపై గన్ను పెట్టి టీఆరెస్ అభ్యర్థిని బలి చేయాలని షా కర్తవ్యాన్ని నిర్దేశించుకున్నారని ప్రగతి భవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం, భూకుంభకోణాలు, లిక్కర్ స్కాంలో కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి అవినీతి ఆధారాలు సేకరించిన కేంద్రం…వాటి సహాయంతో మునుగోడు సీటును దక్కించుకోవాలని కుతూహలంగా ఉంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఏమాత్రం తేడా కొట్టినా అవినీతి అస్త్రాలతో కేసీఆర్ ఫ్యామిలీని రౌండప్ చేస్తామనే షా హెచ్చరికలతో అలర్ట్ అయిన గులాబీ అధినేత మునుగోడును అప్పనంగా బీజేపీకి అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బీజేపీలోని ఓ వర్గం నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే మునుగోడులో తీవ్ర వ్యతిరేకతను ప్రోది చేసుకున్న కూసుకుంట్లను తమ అభ్యర్థిగా కేసీఆర్ ఫిక్స్ చేశారని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి హరీష్ రావుతో అరగంట పాటు రహస్యంగా మంతనాలు కొనసాగించారనే విషయం బయటకు పొక్కడంతో టీఆరెస్, బీజేపీల మైత్రి తాజాగా మరోసారి బయటపడింది.