తొలివెలుగు ఛానెల్ నుంచి రఘు నిష్క్రమించే సమయంలోనే తొలివెలుగు అమ్ముడుపోయిందని వ్యాఖ్యానించి పెద్ద చర్చకు తెరలేపారు. ఆ తరువాత కొద్దిరోజులు ఛానెల్ కథనాల్లో పెద్ద మార్పేమీ కనిపించకపోవడంతో రఘు చెప్పింది వాస్తవం కాదనుకున్నారు. రేవంత్ సన్నిహిత జర్నలిస్ట్ నరసింహ రెడ్డి స్క్రీన్ పై కనిపిస్తుండటంతో ఇది టీఆర్ఎస్ కు అమ్ముడు పోలేదు అనుకున్నారు, కానీ ఇటీవల తొలివెలుగు నుంచి నరసింహ రెడ్డి తో పాటు 20మంది ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామాల అనంతరం ఛానెల్ పింక్ కలర్ పుసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది.
తాజాగా తొలివెలుగులో ప్రసారం అవుతోన్న కథనాలన్నీ రవి ప్రకాష్ సారధ్యంలో నడుస్తున్న ఆర్టీవీవే. ఇందులో ప్రభుత్వ అనుకూల వార్తలే అధికంగా ఉంటున్నాయి. గతంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వార్తలకు మాత్రమే స్పెస్ ఇచ్చే తొలివెలుగు ఆల్ ఆఫ్ సడెన్ గా కాంగ్రెస్ గ్రాఫ్ ను తగ్గించే వార్తలకు ప్రాధాన్యత ఇస్తోంది. పొంగులేటికి షాక్ అంటూ, రేవంత్ రెడ్డికి షాక్, కాంగ్రెస్ దళిత వ్యతిరేకి అంటూ కథనాలు ప్రసారం చేసింది. గతంలో ఇలాంటి కథనాలకు స్పెస్ ఇవ్వని తొలివెలుగు గడిచిన కొన్ని రోజులుగా గులాబీ పార్టీకి అనుకూలంగా వార్త వ్యాఖ్యానాలు చేస్తోంది. ప్రజా సమస్యలపై ఒక్కటంటే ఒక్క వార్త కూడా ఉండడం లేదు.
ప్రభుత్వ అనుకూల వార్తలు ప్రసారం అవుతుండటంతో రఘు చెప్పింది నిజమేనని ఆ ఛానెల్ సబ్ స్క్రైబర్లు ఇప్పుడిప్పుడే అవహగానకు వస్తున్నారు. తొలివెలుగు ఛానెల్ వైఖరి చూస్తుంటే ఆ ఛానెల్ ను ఆర్టీవీగా మార్చేందుకు మరెంతో సమయం పట్టకపోవచ్చునని స్పష్టం అవుతోంది. ఇప్పటికే తొలివెలుగు వెబ్ సైట్ ను ఆర్టీవీ వెబ్ సైట్ గా మార్చిన యాజమాన్యం.. త్వరలోనే ఛానెల్ పేరును కూడా కొద్ది రోజుల్లో మార్చడం ఖాయమని తెలుస్తోంది.
ప్రజలను ఫూల్స్ చేసే ఎత్తుగడ..!!బట్టబయలైన రవి ప్రకాష్ బాగోతం
మీడియా రంగంలో తనదైన ప్రావీణ్యం కల్గిన రవి ప్రకాష్ ప్రజలను ఫూల్స్ చేసే కార్యానికి రహస్యంగా తెరలేపారు. తొలివెలుగును ఆర్టీవీగా మార్చేందుకోసం తనదైన జిమ్మిక్కు చేస్తున్నారు. రోజు ఉదయం తొలివెలుగు లో వచ్చే మార్నింగ్ న్యూస్ ను బుధవారం రోజు ఏపీ కోసం ప్రారంభించిన మార్పు అనే ఛానెల్ లో ప్రసారం చేశారు. మార్పు పేరు ను తొలివెలుగు గా మార్చారు.ఆ ఛానెల్ సబ్ స్క్రైబర్లు 20k ఉన్నప్పటికీ మార్నింగ్ న్యూస్ ప్రసారం అవుతోన్న సమయంలో ఛానెల్ వీక్షకులు 3kగా చూపింది. ఈ లెక్కన చూస్తే టోటల్ వ్యూస్ 40kపైనే ఉండాలి. కానీ కేవలం 4వందలపై మాత్రమే వ్యూస్ వచ్చాయి. అంటే వ్యూస్ ను ఎక్కువగా చూపించి ప్రజలను మోసం చేశాడు రవిప్రకాష్.
ఇక్కడే రవిప్రకాష్ జిమ్మిక్కి ఏంటో స్పష్టం అవుతోంది. అంటే క్రమ,క్రమంగా తొలివెలుగు ప్రేక్షకులను మార్పు న్యూస్ వైపు డైవర్ట్ చేసి…అసలు తొలివెలుగును ఆర్టీవీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు రవి ప్రకాష్. ఆర్టీవీని ఇప్పటికే బీఆర్ఎస్ అనుబంధ మీడియాగా చేసిన రవిప్రకాష్ తొందరలోనే తొలివెలుగును గులాబీ మీడియాగా మార్చే పనిలో లీనం అయినట్లు స్పష్టం అవుతోంది.