మంత్రులు, ఎమ్మెల్యేలతోనే మునుగోడు ప్రచారాని ముగించాలనుకున్నా గులాబీ దళపతి, అనూహ్యంగా తను కూడా ప్రచారానికి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు..?మొదటి విముఖత చూపిన కేసీఆర్ ఆ తరువాత ట్రాక్ మార్చడం ఎవరి సూచన మేరకు జరిగింది..? పది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన కేసీఆర్ తిరిగొచ్చాక మునుగోడుకు వెళ్లాలని ఎందుకనుకున్నారు..? కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అల్లరిమూకలు మునుగోడులో మొహరిస్తుంటే పొలిసు శాఖ సైలెంట్ గా ఉండటం వెనక సీక్రెట్ ఏమైనా ఉందా..? తెలియాలంటే ఈ స్టొరీని చదవాల్సిందే.
మరో వారం రోజుల్లో మునుగోడు రణరంగంగా మారనున్నట్లు తెలుస్తోంది. విచిత్రమేంటంటే బీజేపీ, టీఆర్ఎస్ కనుసన్నలోనే నియోజకవర్గంలో అలజడులు కొనసాగనున్నాయి. ఎలాగైనా మునుగోడులో నెగ్గాలని పంతమ్మీదున్న బీజేపీ డైరక్షన్ లోనే పెద్ద ఎత్తున అలజడలకు ప్రణాళిక రూపొందినట్లు కనిపిస్తోంది. లిక్కర్ స్కాంలో కూతురిని కాపాడుకునేందుకు పదిరోజులుగా హస్తినలోనే ఉన్నా కేసీఆర్, బీజేపీ అగ్రనేతలకు టచ్ లోకి వెళ్ళినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. మునుగోడు ఫలితం బెడిసికొట్టేలా కనిపిస్తోందని బీజేపీ ఆందోళన చెందుతోంది. కనుక, నియోజకవర్గ ఓటర్ల మూడ్ మార్చేందుకు తప్పదనుకున్నా కొన్ని కఠిన పరీక్షలు ఎదుర్కోవాలని బీజేపీ అగ్రనేతలు కేసీఆర్ కు సూచించగా అందుకు ఆయన కూడా అంగీకరించినట్లు సమాచారం.
ఈ ఒప్పందంలో భాగంగా కేసీఆర్ మునుగోడు పర్యటన ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సర్వేలో టీఆర్ఎస్ కు ఆశాజనకమైన ఫలితాలు వస్తుండటంతో ఇక మునుగోడుకు వెళ్ళే అవసరం లేదనుకున్నా కేసీఆర్, బీజేపీ అగ్రనేతల కండిషన్ కు ఒకే చెప్పడంతో తన మనస్సు మార్చుకోవాల్సి వచ్చింది. మునుగోడులో కేసీఆర్ పాల్గొననున్న టీఆర్ఎస్ సభలో కిరాయి మూకలతో ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసి లబ్ది పొందాలనేది ఈ రెండు పార్టీల నేతలు చేసుకున్న ఒప్పందం. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అల్లరిమూకలు మునుగోడులో తిష్టవేయడం ఈ కుట్ర రాజకీయంలో భాగంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పటి నుంచే కొద్దికొద్దిగా భాయోత్పతాన్ని క్రియేట్ చేసి కేసీఆర్ సభ ద్వారా ఆ అలజడి వాతావరణాన్ని పీక్స్ కు తీసుకెళ్ళి మునుగోడును కాంగ్రెస్ నుంచి చేజారేలా చేయాలని రెండు పార్టీలు ఈ నీచ రాజకీయాలకు ఒడిగడుతున్నాయి. ఈ సమాచారం నిఘా వర్గాల ద్వారా పోలీసు యంత్రాంగానికి చేరినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆదేశాలుండటంతో వారు కిమ్మనలేకపొతున్నారు.