ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సి కవిత విచారణ ముగిసింది. మొత్తం 9గంటల పాటు కవితను విచారించారు ఈడీ అధికారులు.అయితే… ఈ నెల 16 న మరోసారి విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
శనివారం కవితని ఈడీ ఏయే అంశాలపై విచారించిందో చూద్దాం…
* ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన చేసింది మీరేనా..?
*మద్యం పాలసీ మార్పు వెనక ఎవరెవరి హస్తముంది..? మీకు మనీష్ సిసోడియాతో పరిచయం ఎలా ఏర్పడింది..?
* ఢిల్లీ సర్కార్ కు సౌత్ గ్రూప్ కు మధ్యవర్తి మీరేనా..?
* లిక్కర్ స్కామ్ లో మీ పాత్ర ఏమిటి..? మీరేమంటారు..?
* అరుణ్ రామచంద్ర పిళ్ళై మీకు బినామీనా..?
*మీ బినామీ అని పిళ్ళై అంటున్నారు..ఇందులో నిజమెంత..?
* పిళ్ళై కు , మీకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయా..?
* పిళ్ళై తో బిజినెస్ చేస్తే నాతో చేసినట్లే అని మీరు చెప్పారా..?
* చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్లి 130 కోట్లు లంచం ఇచ్చారా..?
* 130 కోట్లు లంచం ఎక్కడిది..?ఎవరిచ్చారు..?
*ఇందుకోసం మీకు చార్టెడ్ ఫ్లైట్ ఎవరు ఆరెంజ్ చేశారు..?
*ఫేస్ టైం లో మీరు సమీర్ మహేంద్రతో మాట్లాడారా..?
* శరత్ చంద్రారెడ్డినీ ఎన్నిసార్లు కలిశారు..?
* శరత్ తో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి..?
* ఆధారాలు మహం చేసేందుకు సెల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు..?
* సిమ్ కార్డులు ఎందుకు మార్చాల్సి వచ్చింది..?
ఈ ప్రశ్నలతో కవితని ప్రశ్నించినట్లు సమాచారం.