White challenge మాత్రమే కాదు…
ఏ ఛాలెంజ్ కైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధమే కేటీఆర్..
సినిమా వాళ్ల డ్రగ్స్ కేసు వివరాలు బయటపెట్టేందుకు నువ్వు సిద్ధమా ?
టాలీవుడ్ నటుల డ్రగ్స్ కేసు విచారణ సమయంలో
నీది, నీ అనుచరుల ఫోన్ కాల్ లిస్ట్ బయటపెడతావా ?
డ్రగ్స్ కేసుని మూలాలతో సహా పెకిలిస్తున్న ఐపీఎస్ అధికారి
అకున్ సబర్వాల్ ని ఎందుకు బదిలీ చేశావో చెబుతావా ?
పార్క్ హయత్, నోవాటె సీసీ ఫుటేజ్ మొత్తం బయటకు తీద్దామా ?
హైదరాబాద్ లో అర్థరాత్రి దాగా పబ్ లకి పర్మిషన్ ఎందుకు ఇచ్చావో వివరిస్తావా ?
పబ్ లలో 24 గంటలూ మద్యం సరఫరాకి పర్మిషన్ నీకు తెలియకుండా ఇచ్చారా ?
డ్రగ్స్ సరఫరాపై దాడులు అంటూ రెండు రోజులు హడావుడి చేసి
ఇప్పుడు ఎందుకు గమ్మున కూర్చున్నావో బయటకు వచ్చి ప్రజలకు చెబుతావా ?
నీ నక్క జిత్తులకి కాంగ్రెస్ పార్టీ భయపడదు కేటీఆర్…
వైట్ ఛాలంజ్ మొదట విసిరిందే రేవంత్ రెడ్డి…
ఆ ఛాలంజ్ కి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంది..
నువ్వు టాలీవుడ్ డ్రగ్స్ కేసు, పబ్ ల కమిషన్ల వివరాలు, కాల్ లిస్టుతో రా…
హైదరాబాద్ నడి బొడ్డున, ప్రజల ముందే తేల్చుకుందాం..
వస్తావా… కాంగ్రెస్ సవాల్ కి నువ్వు సిద్ధమా.. ??