పార్టీ సీనియర్లమంటూ చెప్పుకునే కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతుండటంతో ఇక ఆ పార్టీ పని అయిపోయినట్లే అందరు అంటుండగా.. కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. పార్టీలో పనికిమాలిన చెత్త పేరుకుపోయిందని.. ఆ చెత్త తొలగిపోతే హర్షం వ్యక్తం చేయాలే కాని, చింతించకూడదంటూ కొత్త వాదనను వినిపిస్తున్నారు.
రేవంత్ రెడ్డి టీ పీసీసీ అద్యక్ష బాధ్యతలను చేపట్టాక పార్టీకి ఊపు వచ్చింది. ఆ జోష్ ను కంటిన్యూ చేస్తోన్న సమయంలో అసూయ పుట్టిన సీనియర్లు రేవంత్ దూకుడును అడ్డగించేందుకు తెరవెనక అనేక ప్రయత్నాలు చేశారు. రేవంత్ ఎదో కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన ప్రతిసారి సీనియర్లమంటూ రచ్చ చేయడం కొంతమంది నేతలకు అలవాటుగా మారింది. దీంతో సీనియర్ నేతల వైఖరి కార్యకర్తలకు కూడా మింగుడు పడలేదు.
Also Read : బీజేపీకి బిగ్ షాక్ – టీఆర్ఎస్ లోకి ఈటల..?
పార్టీని బలోపేతం చేసేందుకు రేవంత్ తో చేతులు కలపాల్సిన నేతలు..ఇంట్లో సేదా తీరుతు పిచ్చి ప్రేలాపనలు పెల్చుతారా అంటూ క్యాడర్ అసంతృప్తిగా ఉంది. సీనియర్ల కోవర్ట్ రాజకీయాలను వ్యతిరేకిస్తూ ఉండబట్టలేక పార్టీలో ఉంటే ఉండండి లేదంటే.. వెళ్ళిపొండని గద్గద స్వరంతో వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని సీనియర్లు వ్యతిరేకించినా.. కాంగ్రెస్ అభిమానులు మాత్రం స్వాగతించారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టె నేతలను ఇంకెన్ని రోజులు భరిస్తామంటూ సదరు నేతకు అండగా నిల్చున్నారు.
మర్రి శశిధర్ రెడ్డితో కాంగ్రెస్ కు ఎలాంటి ప్రయోజనం లేదు. ఆయన చరిష్మా లేని నాయకుడు. మర్రి చెన్నారెడ్డి వారసుడిగా తప్ప ,సనత్ నగర్ నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంక్, అనుచరవర్గాన్ని డెవలప్ చేసుకొని లీడర్..ఈ కోవకు చెందిన లీడర్లు కాంగ్రెస్ ను వీడితే పార్టీకి నష్టమా అంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కోవర్ట్ లు వెళ్ళిపోతే సంతోషించాలే కాని చింతించకూడదంటున్నారు. మర్రి శశిధర్ రెడ్డి లాంటి నేతలు ఎవరైనా ఉంటె త్వరగా గాంధీ భవన్ ను వెకేట్ చేయండని కోరుతున్నారు.