కోవిడ్ మరణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దొంగాట
WHO నివేదిక ప్రకారం దేశంలో 47 లక్షల మరణాలు
కేవలం 5 లక్షలే అంటోన్న మోడీ సర్కార్
తెలంగాణలో ప్రభుత్వ నివేదిక ప్రకారం 4,111
వాస్తవ సంఖ్య 2.5 – 3 లక్షలగా ఉంటుందని అంచనా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవ లెక్కలు చెప్పాలి
మృతుల కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలి
తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి డిమాండ్
దేశంలో కోవిడ్ మరణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కప్పిపుచ్చుతున్నాయని, సుప్రీంకోర్టుకి కూడా తప్పుడు లెక్కలు చెబుతున్నాయని తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి విమర్శించారు. కోవిడ్ తో దేశంలో 47 లక్షల మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడిస్తోంటే… మోడీ సర్కార్ మాత్రం కేవలం 5 లక్షల మంది మాత్రమే మృతి చెందారని లెక్కలు చెబుతూ సుప్రీంకోర్టుని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు గాంధీ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ మరణాలను అధికారికంగా కేవలం 4,111 అని చూపుతోందని… వాస్తవానికి ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని అన్నారు. ది హిందూ దినపత్రిక నివేదిక ప్రకారం కేవలం జీహెచ్ఎంసీ పరిధిలో లక్షకు పైగా మరణించారని అన్నారు. తమకు ఉన్న సమాచారం మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఈ సంఖ్య 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్యం, ఆక్సిజన్ అందించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇన్ని మరణాలు సంభవించాయని శివసేన రెడ్డి దుయ్యబట్టారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కరోనా మృతుల కుటుంబాలకు రూ. 50 వేల ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి 7 నెలలు దాటిందని… అయినా ఇప్పటి వరకు కమిటీ నుంచి ఎలాంటి నివేదిక అందించలేదని, ఇది తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధిని సూచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ మరణాలు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తప్పుని సరిదిద్దుకుని, గ్రామస్థాయి నుంచి సర్వే చేసి వాస్తవ లెక్కలు కేంద్రానికి చెప్పాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు వెంటనే రూ. 50 వేల పరిహారం చెల్లించాలన్నారు. సమావేశంలో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
రాకేష్ యాదవ్, యువజన కాంగ్రెస్ కార్యదర్శులు రిషికేశ్ రెడ్డి గారు, హరీష్ గారు పాల్గొన్నారు.
గ్రామ స్థాయి నుండి సర్వే నిర్వహించి కరోనా బారిన పడి మరణించిన ప్రతి కుటుంబానికి 50,000 వెంటనే విడుదల చేయాలని మా డిమాండ్.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కమిట్టీ ఏర్పాటు చేసి 6,7 నెలలు అయింది కానీ ఆ కమిటీ నుండి ఎలాంటి నివేదిక అందలేదు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదిక ఇవ్వాల్సిందిగా డిమాండ్ .
ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
రాకేష్ యాదవ్, యువజన కాంగ్రెస్ కార్యదర్శులు రిషికేశ్ రెడ్డి గారు, హరీష్ గారు పాల్గొన్నారు.