కొత్త సంవత్సరంలో తొలి పండగ సెలవులపై ఆతృతతో ఎదురుచూస్తున్నా విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది.
ఎప్పుడెప్పుడు పరీక్షలు రాసి పట్టణం నుండి పల్లె వైపుకు ప్రయాణం చేయాలన్న ఉత్సుకతతోనున్న ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కాలేజీ, గురుకులకు చెందిన విద్యార్థులున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీల్ మిట్టల్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలిపారు.
ఈనెల 14 వ తేదీన భోగి, 15న మకర సంక్రాంతి,16న కనుమ పండగ సందర్బంగా కేవలం మూడు రోజులు సెలవు దినాలుగా ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మూడు రోజుల సెలవులు ముగిసిన తర్వాత రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు మళ్ళి 17 వ తేది మంగళవారం రోజున పునఃప్రారంభం అవుతాయని ఆయన పేర్కొన్నారు.