తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ తమన్నా. తెలుగులోనైతే ఆమె కాల్ షీట్స్ కోసం స్టార్ డైరక్టర్స్ కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇక, తమన్నాతోపాటు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారంతా పెళ్లి చేసుకున్నారు. కాజల్ , హన్సికలు పెళ్లి చేసుకొని బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేశారు. తమన్నా మాత్రం ఒంటరిగానే ఉంటోంది.
మిల్క్ బ్యూటీ పెళ్లి ఖాయమైందని త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని ప్రచారం జరిగింది. ఓ బిజినెస్ మెన్ తో ఆమె ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుందని వార్తలొచ్చాయి. దీంతో తన పెళ్లి వార్తలపై తమన్నా క్లారిటీ ఇచ్చింది. నన్ను అభిమానించే అభిమానులకు నా పెళ్లి విషయం తప్పక చెప్తాను. రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. నేను చేసుకోబోయేవాడెవరో అందరికీ తెలియజేస్తా అంటూ క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనైతే లేదు. పెళ్లి చేసుకోమని ఇంట్లో నుంచి ఒత్తిళ్ళు కూడా లేవు. నా పెళ్లి గురించి జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఏదైనా ఉంటె నేనే అనౌన్స్ చేస్తాను. పలానా వయస్సు వచ్చాక పెళ్లి చేసుకోవాలని టార్గెట్ కూడా ఏమి లేదని.. ఆ రోజు వస్తే మాత్రం తప్పకుండా ప్రకటిస్తానని చెప్పింది తమన్నా.