శృతి హసన్ స్టైలే డిఫరెంట్. సాధారణంగా హీరోయిన్స్స్ అందరూ మేకప్ లేకుండా దిగిన ఫొటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు అస్సలు ఇష్టపడరు కాని, ఇందుకు శృతి హసన్ మాత్రం మినహాయింపు. మేకప్ లేకుండా దిగిన ఫొటోస్ ను సైతం సామజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది ఈ బ్యూటీ.
హీరోయిన్స్ మేకప్ లేకుండా దిగిన ఫొటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నెటిజన్ల నుంచే విమర్శలు ఎదుర్కోవడమే కాకుండా, సినీ అవకాశాలు కూడా సన్నగిల్లుతాయని భయపడుతుంటారు. అయితే , ఇలాంటి భయలేవి తనకు లేవంటూ శృతి హసన్ మేకప్ లేకుండా దిగిన ఫోటోలను అప్పుడప్పుడు షేర్ చేస్తుండగా .. తాజాగా మారోసారి అలాంటి పనే చేసింది.
తాజా ఫోటోలకు శృతిహసన్ సరికొత్త క్యాప్షన్ ఇచ్చింది. తాను ఫీవర్ , సైనస్ తో బాధపడుతున్నానని , ఋతుస్రావంలో ఉన్నానని పేర్కొంది. బ్యాడ్ డే, బ్యాడ్ హెయిర్ తో తన సెల్ఫీలు ఉన్నాయని.. అయినప్పటికీ ఈ లుక్ లో తనను అభిమానులు ఇష్టపడుతారని ఆశిస్తున్నట్లు క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుండగా.. మరికొంతమంది బ్యాడ్ సెల్ఫీ శృతి, ఇలాంటి ఫొటోస్ పెట్టకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం నువ్వు ఎలాగైనా అందంగానే ఉంటావు శృతి అంటూ పేర్కొంటున్నారు. శృతికి సంబంధించి ఈ మేకప్ లేని కొత్త సెల్ఫీలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.
ఈ బ్యూటీ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ సలార్ లో ప్రభాస్ సరసన నటిస్తోంది. అలాగే బాలయ్య సినిమా వీరసింహారెడ్డిలో నటిస్తోంది. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. శృతి రెండేళ్లుగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో డేటింగ్ చేస్తోంది. ప్రస్తుతం అతనితో కలిసి ముంబైలో ఉంటోంది శృతి.