టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో ఒకరైన శర్వానంద్ పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యాడు. హైదరాబాద్ కి చెందిన రక్షిత రెడ్డి అనే అమ్మాయితో శర్వానంద్ ఎంగేజ్ మెంట్ గురువారం జరిగింది. హైదరబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో వీరి నిశ్చితార్ధం జరగగా.. పలువురు సినీ ప్రముఖులు హాజరై ఈ జంటను ఆశీర్వదించారు.
శర్వానంద్ కు చిన్నప్పటి నుంచి స్నేహితుడైన రామ్ చరణ్ తన సతీమణితో కలిసి ఎంగేజ్ మెంట్ కు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు శర్వానంద్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే.. శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి ఎవరు..ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటో చూద్దాం.
రక్షిత రెడ్డి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి మనవరాలట. అతను టీడీపీ సీనియర్ నేత అని సమాచారం. ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని అంటన్నారు. ఇక, రక్షితరెడ్డి అమెరికాలో స్థిరపడిన ఎన్నారై. అక్కడ MS పూర్తి చేసి ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఇంజనీర్ గా పనిచేస్తుంది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించడంతో ఆమె హైదరాబాద్ నుండే పని చేస్తుంది.నెలకి 7 లక్షల రూపాయిల జీతం. ఆమె పేరు మీద హైదరాబాద్ లో చాలా ఆస్తులే ఉన్నాయని తెలుస్తోంది..వాటి విలువ వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా..
ఇక శర్వానంద్ కూడా మంచి ఆస్తిపరుడే.హైదరాబాద్ లో ఏ మూలకు వెళ్లినా శర్వానంద్ కి భూములు ఉంటాయని ఇండస్ట్రీ లో ఒక పెద్ద టాక్ కూడా ఉంది.
Also Read : బాలీవుడ్ హీరోయిన్ తో ప్రభాస్ పెళ్లి – క్లారిటీ ఇచ్చిన కృతి సనన్