తెలంగాణలో వద్దు…ఏపీలో ఫుల్ పవర్స్ ఇస్తాం.. అక్కడ రాజకీయం చేయమని షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ సూచించింది. ఆమె మాత్రం ససేమీరా అంగీకరించలేదని తెలుస్తోంది. కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలు పెద్దగా చేపట్టని షర్మిల మళ్ళీ పార్టీ తరుఫున ఆందోళనలు చేపడుతుండటం అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ విధించిన షరతులకు నిరాకరించే ఆమె మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారన్న వాదనలు సర్వత్ర వినిపిస్తున్నాయి.
ఏపీ పీసీసీ చీఫ్ ఇస్తాం అక్కడ పని చేసుకోమని షర్మిలకు కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. ఆమె మాత్రం తెలంగాణలోనే రాజకీయం చేస్తాను…ఏపీకి వెళ్ళనంటే వెళ్లనని పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకో ఏపీలో సోదరుడు జగన్ తో తలపడేందుకు ఆమె సాహసించడం లేదు. ఏమాత్రం పునాది లేని తెలంగాణలోనే తన రాజకీయ నిర్మాణం చేయాలనుకుంటున్నారు షర్మిల. ఆమె అంతలా పట్టు పట్టేందుకు కారణం ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
కాంగ్రెస్ లో చేరి పార్టీని చీల్చడం షర్మిల టాస్క్ అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే షర్మిలకు కావాలనే బీఆర్ఎస్ ఎలివేషన్ ఇస్తోందని..చిన్న, చిన్న విషయాలకు కూడా అరెస్ట్ చేసి పెద్దదిగా చూపే ప్రయత్నం జరుగుతోందన్న వాదనలు ఉన్నాయి. ఇటీవలి ఆమె గజ్వేల్ పర్యటనను ఎవరూ పట్టించుకోలేదు. అక్కడికి వెళ్ళినా జనం కూడా వస్తారో రారో తెలియదు. కానీ హౌజ్ అరెస్ట్ చేసి షర్మిలకు ఎలివేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన అవకాశాన్ని కూడా ఆమె కాదనుకుంటున్నారని చెబుతున్నారు.
Also Read : హోల్ సేల్ గా తొలివెలుగు ను టీఆర్ఎస్ కు అమ్మేసిన రవిప్రకాష్..!!