సినీ ఇండస్ట్రీకి ఏమైందో ఏమో. ఈ మధ్య కాలంలో అనేక విషాదవార్తలు సినీ ఇండస్ట్రీ నుంచే వచ్చాయి. సినీ దిగ్గజాలు ఒక్కొక్కరుగా రాలిపోతున్నారు. ఈ విషాదం నుంచి ఇండస్ట్రీ తెరుకునే లోపే ఆందోళనకు గురి చేసే వార్తలు వెలువడుతున్నాయి. దీంతో అంత అసలు ఏమైందో ఈ సినీ ఇండస్ట్రీకి.? ఇలా రోగాల బారిన పడుతున్నారంటూ చర్చించుకుంటున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ‘మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. చావు- బతుకులతో పోరాటం చేసింది. ఎలాగోలా ఆ జబ్బును జయించింది. యధావిదిగా షూటింగ్ లు చేసుకుంటుంది. అభిమానులను అలరించేందుకు రెడీ అయింది. కొత్త ప్రాజెక్టులపై సైన్ చేసేందుకు సిద్దం అయిందని.. మరికొద్ది రోజుల్లో హైపర్ యాక్టివ్ అవుతుందని అంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో ఆమె మరింత బిజీ కానుందని సమంత సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇది సంతోషం కల్గించే వార్తే.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కోలుకుందనే వార్తతో అభిమానులు ఓ వైపు ఆనందిస్తుండగానే… మరో నటి తీవ్రమైన వ్యాధి బారిన పడిందనే విషయం తెలిసి ఆందోళనకు గురయ్యారు. తెలుగు సినిమాలో నటించి తనదైన గుర్తింపు పొందింది.ఆమె ఎవరో కాదు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పటికీ వదినమ్మా అని పిలిచుకునే రేణు దేశాయ్ తాజాగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి ఆమె చేసిన పోస్ట్ భావోద్వేగానికి గురి చేస్తోంది.
కొన్నాళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నా… దాన్ని ఫేస్ చెయ్యడానిక్కావల్సిన శక్తిని ఇప్పుడిప్పుడే కూడదీసుకుంటున్నా… అంటూ ఇన్స్టాలో ఆమె చేసిన పోస్ట్… వైరల్గా మారింది. నాలాగే ఎవరైనా బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని నింపడమే ఈ పోస్ట్ ఉద్దేశ్యం అంటూ చెప్పుకొచ్చారు రేణుదేశాయ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు. బలంగా నిలబడండి… ఈ ప్రపంచం మనకోసం ఎన్నో సర్ప్రైజ్లను ప్లాన్ చేసింది. నవ్వుతూ వాటి కోసం ఎదురుచూద్దాం అంటూ ఆమె రాసుకున్న ఇన్స్పిరేటివ్ వర్డ్స్ నెటిజన్లను కదిలించేస్తున్నాయి.
జబ్బులలో రకరకాల జబ్బులు ఉంటాయి. కానీ ఇంతవరకు వినని, చదవని, చూడని వ్యాధి బారిన పడింది టాలీవుడ్ హీరోయిన్ అనుష్క. ఇంతకీ ఆమెకొచ్చిన వింత జబ్బు ఏంటో తెలుసా..? నవ్వాపుకోలేకపోవడం. కంటిన్యూగా నవ్వడమే ఆమెకున్న జబ్బట. నవ్వడం మంచిదే. కాని ఆమె రెండు, మూడు నిమిషాలపాటు నవ్వుకొని ఆగిపోదట. అలా ఓ 15, 20నిమిషాల వరకు నవ్వుతూనే ఉంటుందట.
పక్క వాళ్లు ఫీలవుతున్నా.. పిచ్చొళ్లలా అనుకుంటున్నా.. భయంతో పక్కకు పరిగెత్తినా.. ఆమెను ఆపడానికి ప్రయత్నించినా కూడా.. నవ్వు అసలేమాత్రం ఆగదట మన స్వీటీకి. ఈ విషయం బయటవాళ్ళు గుర్తించి చెప్పింది కాదు. స్వయంగా అనుష్కనే చెప్పింది.
అలాగే తమిళ్ హీరో జీవా నటించిన రంగం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఫియాబాజ్ పై. తాను కూడా మయో సైటిస్ వ్యాధితో బాధపడుతున్నా అని తెలిపింది. మయోసైటిస్ వ్యాధి ఉందని తెలిసిన వెంటనే తాను ఇంట్లో వారికి కూడా ఈ విషయం చెప్పలేదని, ఇంట్లో వారికి తెలియకుండా ముంబైలో ఉండి ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నానని తెలిపింది. తన వ్యాధి గురించి ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.