టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుద్ సింగ్ జడేజా కీలక వ్యాఖ్యలు చేశారు. తన కోడలు బీజేపీలో చేరినా తాము మాత్రం కాంగ్రెస్ తోనే కలిసి సాగుతామని స్పష్టం చేశారు. పార్టీ, కుటుంబం వేర్వేరు అని వ్యాఖ్యానించారు.
రవీంద్ర జడేజా భార్య రివాజా జడేజా గుజరాత్ లోని జామ్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న జడేజా తండ్రి కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా జడేజా తండ్రి అనిరుద్ జడేజా క్లారిటీ ఇచ్చారు.
Also Read : రవీంద్ర జడేజా భార్యకు ఎమ్మెల్యే టికెట్
తన కోడలు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినంత మాత్రాన తమ కుటుంబం బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు కాదని.. తాను కాంగ్రెస్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. మా ఇంటి కోడలు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినా ఆమెతోపాటు తన సోదరుడిపై గౌరవం తగ్గదని జడేజా సోదరి నైనా జడేజా వ్యాఖ్యానించింది.