రాహుల్ నీకేమైనా పిచ్చి పట్టిందా..? హాయిగా దర్జాగా కాలు మీద కాలేసుకొని, ఏమాత్రం అలసట లేకుండా , విలాసవంతమైన జీవితాన్ని గడపకుండా ఎండలో ఎండుతూ, వానలో నానుతూ, చలికి వణుకుతూ ఎందుకయ్యా ఈ దేశం కోసం తిరుగుతున్నావ్.? మతం – కులమంటే కుత్తుకలు తెగ్గోసుకునే మమ్మల్ని రాజకీయంగా వాడుకోవాలే కాని, ఇలా ఐక్యం చేసి ఏం సాధిస్తావ్ రాహుల్. ఈ దేశ సేవలో నాన్నమ్మ, నాన్నను పోగుట్టుకున్నావ్ అయినా మళ్ళీ దేశం, దేశమంటూ ఆ కలవరింతలేంటి రాహుల్..?
ఆకలి, ఆర్ధికమాంద్యం, ఆర్ధిక సంక్షోభం, నిరుద్యోగం.. ఇలా ఎ అంశాలపైనైనా మాట్లాడమంటే గుక్క తిప్పుకోకుండా అనర్గళంగా మాట్లాడేస్తావ్. సావధానంగా మాత్రమే కాదు సహేతుకంగా సమాధానమిచ్చే నీ వాగ్ధాటిని గుర్తించని ఈ దేశం కోసం ఎందుకీ తాపత్రయం రాహుల్..? విలేకర్ల ప్రశ్నలకు భయపడి టెలి ప్రాంప్టర్ తోనే నెట్టుకొస్తు, దేశభక్తి ముసుగులో ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తోన్న పాలకులను చూస్తే నీకింకా జ్ఞానోదయం కలగడం లేదా రాహుల్.
ఎందుకు ఈ దేశమంటే మీ కుటుంబానికంత ప్రేమ..? ప్రేమతో ఏం సాధిస్తారు రాహుల్..? ఈ దేశ ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోవడం మినహా. అయినా నీ అడుగులు ఎదో కొత్త ఆశను వాగ్దానం చేస్తున్నాయి రాహుల్. మీ పలకరింపు వేదనతో గూడుకట్టుకుపోయిన ఎంతోమందికి సాంత్వన చేకూర్చుతున్నాయి. రైతులు, విద్యార్థులు, వృద్దులతో నీ పలకరింపు చూశాక నువ్వు జనం మధ్య ఉండాలని గట్టిగా చెప్పాలనుంది రాహుల్. నిన్ను చూస్తుంటే ఈ దేశానికి టార్చ్ బేరర్ నువ్వేనని దిగంతాలు సైతం పిక్కటిల్లెలా అరిచి చెప్పాలనుంది.