ప్రభాస్ – అనుష్క జోడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకటైతే బాగుంటుందని కోరుకునే వారి సంఖ్య లెక్కే లేదు. సెలబ్రిటీల పర్సనల్ విషయాల్లో తలదూర్చి.. వారు పలానా హీరోయిన్ తో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు కోరుకోవడం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందులో ప్రభాస్ – అనుష్కలు పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు.
అనుష్క – ప్రభాస్ లు ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఈ ఇద్దరు క్లారిటీ ఇచ్చినా ఈ తరహ వార్తలకు బ్రేక్ పడటం లేదు సరికదా వార్తలు హద్దులు మీరుతున్నాయి. ఈ జంటకు ఓ కొడుకు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది.
చైర్ పై కూర్చొని బిడ్డను చేతిలో పట్టుకొని అనుష్క ఉండగా.. కింద కూర్చొని కొడుకును చూసి ప్రభాస్ మురిసిపోతున్నట్లు .. పక్కన ఓ కుక్క పిల్ల..ఇలా ఈ పిక్ చూడముచ్చటగా ఉంది. ఎడిట్ చేస్తే చేశారు కానీ నిజం అవ్వాలని కోరుకుందాం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : బాలీవుడ్ హీరోయిన్ తో ప్రభాస్ పెళ్లి – క్లారిటీ ఇచ్చిన కృతి సనన్