టాలీవుడ్ నటి పూర్ణ గుడ్ న్యూస్ చెప్పారు. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఈ గుడ్ న్యూస్ ను పంచుకున్నారు. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పూర్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే, పెళ్ళైన ఆరు నెలల్లోనే పూర్ణ ప్రెగ్నెన్సీ ప్రకటించడం విశేషంగా మారింది.
గత ఏడాది ప్రారంభంలో పెళ్లి అనౌన్స్ మెంట్ చేశారు పూర్ణ. వ్యాపారవేత్త అయిన షానిద్ ఆసిఫ్ అలీతో ఆమెకు ఎంగేజ్ మెంట్ జరిగింది. నెలలు గడిచిన పెళ్లి వార్త బయటకు చెప్పకపోవడంతో బ్రేకప్ అయి ఉంటుందని అనుకున్నారు. కాని అంతలోనే పూర్ణ షాక్ ఇచ్చింది. మాకు పెళ్లి కూడా జరిగిపోయిందని చెప్పింది.
జూన్ 12న దుబాయ్ లో అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి జరిగింది. అనివార్య కారణాల వలన నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నాం. కేరళలో బంధువులు, మిత్రుల కోసం ఇండియాలో రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు పూర్ణ. అయితే , ఇప్పటికీ రిసెప్షన్ జరిగింది లేదు. కాని ఇంతలోనే తల్లిని అయ్యానంటూ ప్రకటించి షాక్ ఇచ్చింది పూర్ణ.
తల్లి కాబోతున్నానని ఇన్స్టాగ్రామ్ స్టేటస్ పోస్ట్ చేశారు పూర్ణ. దీంతో జబర్దస్త్ కమెడియన్లు, ఆమె అభిమానులు పూర్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read : రష్మీ ని పోర్న్ స్టార్ తో పోల్చిన రామ్ ప్రసాద్