–18న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం జిల్లా సీనియర్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైంది. శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ అధినాయకత్వమే రంగంలోకి దిగింది. ఇందుకోసం కేంద్రహోం మంత్రి అమిత్ షా తో పొంగులేటి భేటీ కానున్నారు.
ఢిల్లీలో ఈ నెల 18న అమిత్ షా తో పొంగులేటి సమావేశం కానున్నారు. అనంతరం పార్టీ మార్పుపై పొంగులేటి కీలక ప్రకటన చేయనున్నారు. ఈ విషయమై అయన అనుచరులకు ఆల్రెడీ సంకేతాలు కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచి తన అనుచరులతో భేటీ కానున్న పొంగులేటి అమిత్ షా తో భేటీ అనంతరం బీజేపీలో చేరికపై అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.
ఖమ్మం జిల్లాలో పట్టున్న పొంగులేటి బీఆర్ఎస్ ను వీడితే ఆ పార్టీకి పెద్ద దెబ్బేనని చెప్పొచ్చు.