Site icon Polytricks.in

బిగ్ బ్రేకింగ్ – బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

18న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

అమిత్ షా తో భేటీ తర్వాత పొంగులేటి నిర్ణయం
అనుచరుల ను సిద్ధం చేస్తున్న పొంగులేటి
పొంగులేటి బిజెపిలోకి చేరిక దాదాపు ఖరారు
రేపటి నుంచి నియోజకవర్గాల్లో అనుచరులతో భేటీ
శ్రీనివాసరెడ్డి తో నేరుగా అధిష్టానం మంతనాలు…..

ఖమ్మం జిల్లా సీనియర్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైంది. శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ అధినాయకత్వమే రంగంలోకి దిగింది. ఇందుకోసం కేంద్రహోం మంత్రి అమిత్ షా తో పొంగులేటి భేటీ కానున్నారు.

ఢిల్లీలో ఈ నెల 18న అమిత్ షా తో పొంగులేటి సమావేశం కానున్నారు. అనంతరం పార్టీ మార్పుపై పొంగులేటి కీలక ప్రకటన చేయనున్నారు. ఈ విషయమై అయన అనుచరులకు ఆల్రెడీ సంకేతాలు కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచి తన అనుచరులతో భేటీ కానున్న పొంగులేటి అమిత్ షా తో భేటీ అనంతరం బీజేపీలో చేరికపై అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.

ఖమ్మం జిల్లాలో పట్టున్న పొంగులేటి బీఆర్ఎస్ ను వీడితే ఆ పార్టీకి పెద్ద దెబ్బేనని చెప్పొచ్చు.

Exit mobile version