పవన్ కళ్యాణ్. ఈయన్ను చూస్తేనే పూనకంతో ఊగిపోయే అభిమానులు పవర్ స్టార్ సొంతం. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే ఆయన అభిమానులకు పండగే. థియేటర్ల వద్ద హడావిడి చెప్పాల్సిన పనిలేదు. డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. కాగా.. తాజాగా పవన్ కు సంబంధించి ఓ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చి..హీరోయిన్ రేణు దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం కలిగాక విబేధాలు రావడంతో విడిపోయారు. కొన్ని రోజులు ఒంటరిగా ఉన్న పవన్ రష్యాకు చెందిన అన్నా లెజ్నావాను మూడో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నారు.
వీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుండగా పవన్ కళ్యాణ్ – అన్నా లెజ్నావాలు విడిపోనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయని ఈ క్రమంలోనే మూడో భార్యకు పవన్ విడాకులు ఇచ్చేందుకు రెడీ అయ్యారనే వార్త ట్రెండ్ అవుతోంది. ఈ వార్తలను పవన్ సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. ఇదంతా వైసీపీ సోషల్ మీడియా పనేనని పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నారు.
కాగా.. సెలబ్రిటీల జాతకలు చెప్పడంలో ఆరితేరిన వేణు స్వామి మాత్రం షాకింగ్ విషయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ త్వరలో నాలుగో పెళ్లి చేసుకుంటారని బిగ్ బాంబ్ పేల్చారు. అది ఎప్పుడైనా అవ్వొచ్చునని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసేది ఇక్కడి నుంచేనా..?