• Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC

Subscribe to Updates

తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలు, సర్వేలు మరియు ప్రత్యేక విశ్లేషణల తాజా అప్‌డేట్స్ పొందండి.

What's Hot

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 2026

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Government & Policy
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
Polytricks.in
Home » వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసేది ఇక్కడి నుంచేనా..?
AndhraPradesh

వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసేది ఇక్కడి నుంచేనా..?

Prashanth PagillaBy Prashanth Pagillaజనవరి 14, 2023వ్యాఖ్యలు లేవు2 Mins Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

ఏపీలో అప్పుడే జనసేన ఎన్నికలకు రెడీ అవుతోంది. వైసీపీని గద్దె దించేందుకు పొత్తు తప్పనిసరి అనుకుంటే టీడీపీతో కలిసి వెళ్తామని జనసేనాని సంకేతాలు పంపుతున్నారు. దీంతో పవన్ పోటీపై అప్పుడే చర్చ మొదలైంది. గతంలో పోటీ చేసిన గాజువాక, భీమవరం నుంచే జనసేన అధినేత మరోసారి పోటీ చేస్తారా..? లేక ఇతర నియోజకవర్గాలు ఏమైనా పరిశీలనలో ఉన్నాయా..? అని రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి.

2019లో పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేశారు. భీమవరం, గాజువాక నుంచి బరిలో నిలవగా ఆ రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. అయితే..వచ్చే ఎన్నికల్లో మాత్రం గతంలో పోటీ చేసిన ఈ రెండు నియోజకవర్గాలతోపాటు మరో మూడు నియోజకవర్గాలు జనసేన పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయం వరకు పవన్ పోటీ చేసే నియోజకవర్గాలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం లేదు. ఎందుకంటే జనసేన పరిశీలనలో ఉన్న మరో మూడు నియోజకవర్గాల వెనక అ పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడ ఉంది.

జనసేన పరిశీలనలో ఉన్న మూడు నియోజకవర్గాలు తిరుపతి, కాకినాడ రూరల్, పిఠాపురం. ఈ మూడు చోట్ల పవన్ పోటీని పరిశీలించడం వెనక కారణం ఉంది. కాపు సామజిక వర్గం ఓట్లు ఈ మూడు నియోజకవర్గంలో అధికంగా ఉన్నాయి. తిరుపతి నుంచి ప్రజారాజ్యం అద్యక్షుడుగా మెగాస్టార్ చిరంజీవి పోటీ చేసి అప్పట్లో విజయం సాధించారు. తిరుపతిలో కాపు సామజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. అందుకే జనసేన ఈ స్థానాన్ని పరిశీలిస్తోంది.

పిఠాపురం నియోజకవర్గంలో 75శాతం ఓట్లు కాపు సామజిక వర్గం ఓట్లే. అందుకే అక్కడి నుంచి పవన్ పోటీ చేస్తే విజయం నల్లేరు మీద నడకే అవుతుందని జనసేన నేతలు భావిస్తున్నారు. పిఠాపురం జనసేనానికి ఫేవర్ గా ఉందని జనసేన నేతలు పార్టీ దృష్టికి తీసుకెళ్తున్నారు.

కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి కురసాల కన్నబాబు గతంలో ప్రజారాజ్యం నుంచి గెలిచారు. ఆ తరువాత వైసీపీలో చేరి వరుసగా విజయం సాధిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో లక్ష ఎనభై వేల ఓట్లు ఉంటె.. అందులో లక్ష ఓట్లు కాపు సామజిక వర్గం వారివే. అందుకే పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే విజయం ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు.

గాజువాక‌, భీమ‌వ‌రం నుంచి పోటీ చేయ‌ని ప‌క్షంలో.. కాకినాడ రూర‌ల్, పిఠాపురం, తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గాల‌ను జ‌న‌సేనాని ఎంచుకునే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 2026

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026

Comments are closed.

Don't Miss
News

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 20260

దానం నాగేందర్ అనర్హతపై దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఖైరతాబాద్ ఉపఎన్నికకు ఇక మిగిలిన అధికారిక ప్రక్రియ ఏమిటి?

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026

ఎర్రవల్లి నుంచి కొటూర్ వరకూ భూముల యుద్ధం: అసెంబ్లీలో ఆరోపణలు, విచారణ సవాళ్లు

సెప్టెంబర్ 22, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఖైరతాబాద్ ఉపఎన్నికకు తొలగిన ప్రధాన అడ్డంకి!

సెప్టెంబర్ 24, 2026

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

సెప్టెంబర్ 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

సెప్టెంబర్ 22, 2026

ఎర్రవల్లి నుంచి కొటూర్ వరకూ భూముల యుద్ధం: అసెంబ్లీలో ఆరోపణలు, విచారణ సవాళ్లు

సెప్టెంబర్ 22, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version