నగ్మా 1990వ దశకంలో పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాలల్లో అగ్ర హీరోలతో హీరోయిన్ గా నటించి రాణించారు. ఆమె ఒకడికి బుక్కయ్యి అడ్డంగా దొరికిపోయారు. ఆమె చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎవ్వరిని నమ్మరు. ఆమెకు హిరో యిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నుంచి బరిలోకి ఆమె ఓటమి పాలయ్యారు. జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
ఆమె ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లు మారింది ఆమె పరిస్టితి. ఆమె బ్యాంక్లో ఉన్న డబ్బు అంతంత మాతమే. ఈమధ్య ఆమె అకౌంట్ ఉన్న బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. ఆమె వివరాలను ‘కేవైసి’ లో అప్ డేట్ చేయాలనీ, లేకపోతే ఏటిఎం, క్రెడిట్కార్డ్ లు, బ్యాంకు లావాదేవీలు నిలిచిపోతాయని, మరో గంగలో గడువు ముగుస్తుంది అని ఓ మోసగాడు చెప్పాడు. ఆ తర్వాత ఆమె తన బ్యాంకు, క్రెడిట్ కార్డ్, ఏటిఎం కార్డ్ వివరాలు అడిగాడు.
ఆమె కొన్ని వివరాలు మాత్రమే చెప్పింది. ఆమె చెప్పిన వివరాలు సరైనవో కావో తెలుసుకోడానికి ఒటిపి పంపుతున్నాను అని నమ్మబలికాడు. ఆమె ఫోన్ కు వచ్చిన ఒటిపి నెంబర్ చెప్పింది. అంతే! ఆమె అకౌంట్ లోంచి లక్ష రూపాయలు అతని అకౌంట్ లోకి బదిలీ అయ్యాయి.
ఆమెకు అనుమానం వచ్చి అతనిని నిలదియగా అది పొరపాటున వచ్చిందని, మరో ఒటిపి వస్తోంది, దాని వివరాలు కూడా చెప్పాలని నమ్మబలికాడు. మరో ఒటిపి నెంబర్ రాగనే ఆమెకు అనుమానం వచ్చి ఎదురు తిరిగింది. దాంతో అతను లైన్ కట్ చేశాడు. ఆమె అనుమానంతో తన అకౌంట్ బ్యాలెన్సు చెక్ చేయగా లక్ష రూపయలు తగ్గాయి. ఆమె వెంటనే ఆ ఆ మోసగాడికి ఫోన్ చేసింది. ఇంకే? ‘తాత్కాలికంగా ఆ నెంబర్ పని చేయడం లేదని’ కంప్యూటర్ జవాబు వచ్చింది. ఆమె వెంటనే బ్యాంకు కు ఫోన్ చేసి జరిగిన మోసం గురించి చెప్పింది. వాళ్లు దానిని సైబర్ నేరం కింద కేసు నమోదు చేయించారు.
ఆమె సైబర్ నేరాల గురించి నలుగురికి చెప్పి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించేది. గొప్ప చదువు, లోకాన్ని చదివి, రాజకీయాలను చదిన ఆమె కూడా చివరికి ఇలా అడ్డంగా బుక్ కావడం విచిత్రం. మరి సామాన్యుల పరిస్టితి ఏమిటి?