కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ మిత్రపక్షంగా మార్చుకున్న బీజేపీ రాజకీయ ప్రత్యర్ధులపై ఈడీని ఉసిగొల్పుతుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ.. తాజాగా ఈ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు విచారణకు రావాలంటూ నోటిసులు అందించినట్లుగా కథనాలు వస్తున్నాయి. మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, గీతారెడ్డితోపాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లకు నోటిసులు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ స్పీడ్ పెంచిందనే వార్తలతో అలర్ట్ అయిన బీజేపీ అగ్రనాయకత్వం టి. కాంగ్రెస్ నేతలపైకి ఈడీని ఉసిగొల్పిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
నలుగురు కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటిసులు ఇష్యూ చేసిందన్న వార్తలపై వారు స్పందించారు. తమకు ఈడీ నోటిసులు ఇవ్వలేదని..ఒకవేళ నోటిసులు వస్తే విచారణకు హాజరు అవుతామని స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ కు ఆర్థికంగా సహాయం చేశామని… చెక్కుల రూపంలోనే సహాయం అందించామని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం ఇష్యూపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా ఆల్ ఆఫ్ సడెన్ గా ఈడీ కాంగ్రెస్ నేతలకు నోటిసులు సర్వ్ చేసిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. లిక్కర్ స్కాం చర్చను పక్కదోవ పట్టించేందుకు ఈడీని కాంగ్రెస్ నేతలపైకి బీజేపీ ఉసిగొల్పిందన్న అభిప్రాయాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
లిక్కర్ స్కాం ను నిగ్గు తేల్చేందుకు మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్సి కవిత భర్త , ఎంపీ సంతోష్ కుమార్ లతో బిజినెస్ వ్యహారాలు నడిపిన వెన్నమనేని శ్రీనివాస్ రావును ఈడీ ఇటీవల విచారించింది. ఈ క్రమంలోనే ఈ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను కూడా విచారించేందుకు త్వరలోనే ఈడీ అధికారులు పిలుస్తారని ఊహగానాలు వస్తుండగా.. ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో టి. కాంగ్రెస్ నేతలకు నోటిసులు ఇష్యూ చేయడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కవితను ఈ లిక్కర్ స్కాం నుంచి బయటపడేందుకు అంతర్గతంగా బీజేపీ -టీఆరెస్ ల మధ్య రహస్య ఒప్పందం జరిగి ఉంటుందని.. అందులో భాగంగానే ఆ చర్చను పక్కదోవ పట్టించేందుకు ఈ కార్యాన్ని ముంగిట వేసుకున్నారని ఏనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.