సోమవారం షూటింగ్ లో ఉండగా యంగ్ హీరో నాగ శౌర్య స్పృహ తప్పి పడిపోయారు. దాంతో ఆయన్ను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. నాగ శౌర్యకు చికిత్స కొనసాగుతోంది.
ఓ యాక్షన్ సీన్ లో నాగ శౌర్య సిక్స్ ప్యాక్స్ చూపించాల్సి ఉండటంతో డైట్ మెయింటేన్ చేశాడు. అందుకోసం తీవ్రంగా శ్రమించాడు. నాలుగు రోజులుగా మంచి నీళ్ళు కూడా ముట్టలేదని సమాచారం. దాంతో బాగా అలసిపోయిన నాగ శౌర్య..షూటింగ్ స్పాట్ లో కూడా ఏమి ముట్టకుండానే షూటింగ్ లో జాయిన్ కావడంతో.. కళ్ళు తిరిగి పడిపోయారని అంటున్నారు.
మంచు మనోజ్ రెండో పెళ్లి – అమ్మాయి ఎవరో తెలుసా..?
ఆయన కిందపడిపోగానే వెంటనే నాగ శౌర్యను ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. శౌర్యకు వైరల్ ఫీవర్ ఎటాక్ అయిందని వైద్యులు వెల్లడించారు. ఇప్పటికీ ఆయన అలసటగానే ఉన్నారని చెప్పారు. మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ నెల 20న శౌర్య వివాహం జరగాల్సి ఉంది. బెంగళూర్ లో అనూష తో వివాహం కావాల్సి ఉంది. పెళ్లికి ఇంకా మరో నాలుగు రోజుల సమయం ఉండగా.. ఇప్పుడు శౌర్య అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.