స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ ప్రభుత్వం తరుఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ముకుల్ రోహాత్గీ వాదనలు అందర్నీ నివ్వెరపోయేలా చేస్తున్నాయి. కారణం.. ఒకే తరహ కేసులో ఆయన భిన్న వాదనలు వినిపించడమే. అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో యడ్యూరప్ప అవినీతికి పాల్పడ్డారని ఓ వ్యక్తి లోకాయుక్తలో కేసు వేశారు. దానిపై లోకాయుక్త విచారణకు ఆదేశించింది. ఆ ఆదేశాలను చెల్లవని యడ్యూరప్ప తరుఫున వాదించారు ముకుల్ రోహాత్గీ. మాజీ ముఖ్యమంత్రిపై 17A సెక్షన్ వర్తిస్తుందని వాదనలు వినిపించి విచారణ నుంచి యడ్యూరప్పను తప్పించారు.
తాజాగా అదే తరహ కేసును వాదిస్తున్న ముకుల్ రోహాత్గీ…స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సెక్షన్ 17A వర్తించదని వాదించడం గమనార్హం. నిజానికి మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు 17A సెక్షన్ వర్తిస్తుంది. 17A అనేది అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై తరువాత వచ్చే ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలు తీసుకోకుండా కట్టడి చేసేందుకు కల్పించిన రక్షణ చట్టం. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో భాగస్వామ్యమైన అధికారులను ఎవరిని ప్రశ్నించకుండా నేరుగా చంద్రబాబునే అరెస్ట్ చేయడంతో ఈ కేసు కక్ష సాధింపు చర్యలో భాగమేనని ఈజీగా అర్థం అవుతుంది.
గతంలో ఈ తరహ కేసులో యడ్యూరప్పకు 17A సెక్షన్ వర్తిస్తుందని వాదించి అనుకూల ఫలితం రాబట్టిన ముకుల్ రోహాత్గీ చంద్రబాబు విషయంలో మాత్రం ఈ సెక్షన్ వర్తించదని వాదనలు వినిపించడం విశేషం. సీనియర్ లాయర్ ముకుల్ రోహాత్గీ వాదనలు విన్న న్యాయనిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వ్యక్తులను బట్టి సెక్షన్స్ వర్తింపు ఉంటుందా..? అని రోహాత్గీ వాదనలతో చర్చ ప్రారంభమైంది. ఎన్నో కేసులను వాదించి అనుకున్న ఫలితం రాబట్టిన రోహాత్గీ ఎంతోమంది యువ లాయర్ లకు ఆదర్శంగా ఉండాల్సింది. కానీ ఆయన వాదనలు మాత్రం భిన్నంగా ఉండటం పట్ల ముక్కున వేలేసుకుంటున్నారు.
Also Read : చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్ – టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు..!?