నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న వీధి కుక్కల నివారణకు జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ స్టానిక కార్పో రేటర్లతో కూడిన ఒక కమిటి వేశారు. దీనిని రహమత్ నగర్ కార్పొరేటర్ సి ఎన్ రెడ్డి సారథ్యంలో వహించారు. కమిటి నగరం మొత్తం తిరిగింది. ఓ నివేదికను తయారుచేసి 26 సూచనలతో కూడిన నివేదికను విజయలక్ష్మీకి ఇవ్వగా ఆమె ఆ దిశగా ఆక్షన్ ప్లాన్ మొదలు పెడుతున్నారు.
ఇందులో ప్రధానమైనవి, ప్రస్తుతం జిహెచ్ఎంసి దగ్గర కేవలం 50 వీధి కుక్కలను పట్టుకునే వాహనాలు ఉన్నాయి. ఇందులో 14 జిహెచ్ఎంసిసి సొంత వాహనాలు. 36 అద్దె వాహనాలు. ఇవి సరిపోవడంలేదు. అందుకే కుక్కల బెడదను సమర్థవంతంగా నియంత్రించడానికి, ఉద్యోగులతోపాటు పాటు మరో 10 అదనపు వాహనాలను నియమించాలని యోచిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో స్టెరిలైజ్ చేయని కుక్కలను పట్టుకోవడానికి వ్యాన్‌లను రాత్రి షిఫ్ట్‌లో కూడా మోహరిస్తారు.
నగరంలో ఇప్పుడు ప్రభుత్వం మంజూరు చేసిన వెటర్నరీ ఆఫీసర్ల 31 పోస్టులు ఉన్నాయి. కానీ 12 వెటర్నరీ ఆఫీసర్లు మాత్రమే పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వెటర్నరీ & పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల కొరత దృష్ట్యా వెటర్నరీ & పశుసంవర్ధక శాఖ కూడా పశువైద్య అధికారులను జిహెచ్ఎంసికి డిప్యూట్ చేయడానికి సుముఖంగా లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల భర్తీకి జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇది సాధ్యం కాకపోతే, 31 ప్రైవేట్ పశువైద్యులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకునే యోచనలో ఉన్నారు.
కుక్కలకు స్టెరిలైజేషన్ తీసుకోవడానికి వెటర్నరీ విభాగానికి సమాచారం ఎప్పటికప్పుడు అందిచాలని అనుకుంటున్నారు. ప్రతి వార్డు స్థాయిలో పశువైద్య కార్యకలాపాలను చేపడతారు. నగరంలో ఉన్న మొత్తం 150 వార్డులకు వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ల సేవలను వాడుకోవడంతో పాటు అవుట్‌సోర్స్ సేవలను వాడుకోనున్నారు.
వీధి కుక్కలను పెంచుకోవడానికి, వాటికి ఆహారం ఇవ్వడానికి, వాటి సంరక్షణ కోసం జంతు ప్రేమికులకోసం వారి ప్రాంతాల్లో కొంత స్థలాన్ని కేటాయించేలా ప్రోత్సహిస్టారు. చార్మినార్ జోన్, శేరిలింగంపల్లి జోన్‌లో జంతు సంరక్షణ కేంద్రాల నిర్మాణాన్ని వేగవంతంగా చేపట్టడం.
పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన ల్యాప్రోస్కోపిక్ పరికరాలు, శస్త్రచికిత్సలో వాడే కొత్త టెక్నాలజీ తీసుకోనున్నారు. జంతు సంరక్షణ కేంద్రంలో ద్వారా ‘పీపుల్ ఫర్ యానిమల్స్’ కి అందించిన మౌలిక సదుపాయాలను పెంచున్నారు. బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ సహాయం తీసుకుని జంతు సంరక్షణ సదుపాయాన్ని, స్టెరిలైజేషన్, ఇతర జంతు సంక్షేమ కార్యకలాపాల కోసం ఉపయోగించాలని అనుకుంటున్నారు. ఎందుకంటే లోగడ ప్రభుత్వం బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్‌కు భూమిని కేటాయించింది.
ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, హాస్టళ్లు, నాన్ వెజ్, షాపుల యజమానులనుకు నోటీసులు జారీ చేస్తారు. ఆహార వ్యర్థాలను సక్రమంగా పారవేయడం కోసం కొత్త నిబంధనలు తేనున్నారు. చెత్త పారవేయదానికి అత్యంత ప్రాధాన్యత. కుక్కలు అందులోకి దురకుండా మూతలు పెడతారు. వీధి కుక్క పిల్లలను దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించండి. డాగ్ క్యాచింగ్ స్క్వాడ్ నామకరణం “స్ట్రే డాగ్ స్టెరిలైజేషన్ యూనిట్”గా మార్చబడుతుంది. జంతు సంరక్షణ కేంద్రాలలో రేబిస్ లక్షణాలను కలిగి ఉన్న కుక్కలను పరీక్షించడానికి నిబంధనలను కొత్తగా తాయారు చేశారు.
కుక్క కాటు బాధితులందరికీ పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ అందించడానికి, యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్, రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్‌లు అన్ని అందుబాటులో ఉంచుతారు. ఇవన్నీపాటిస్తే నగరంలోని కుక్క నివారణ ఇట్టే తగ్గిపోతుంది అని మేయర్ విజయ లక్ష్మీ చెప్పారు.