మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోనున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో పేరుగాంచిన భూమా నాగిరెడ్డి – శోభల రెండు కూతుర్ని మనోజ్ వివాహం చేసుకుంటారని ఆ ప్రచార సారాంశం. వీటిని వారిద్దరూ ఖండించకపోవడంతో వీరి పెళ్లిబాజాలు త్వరలో మొగనున్నాయని ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కొత్త యాంకర్ ను పడేసే పనిలో హైపర్ ఆది..!
మంచు మనోజ్ 2015లో ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తరువాత ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి మంచు మనోజ్ ఒంటరిగానే ఉంటున్నారు. ఈ సమయంలోనే మంచు మనోజ్ భూమానాగిరెడ్డి కూతురు మౌనిక రెడ్డితో కనిపించడం… తరుచుగా బయట జంటగా కనిపించడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే వార్తలకు బలం చేకూరింది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ కావడంతోనే వీరిద్దరి సోషల్ మీడియాలో అకౌంట్ లో ఫోటోలు షేర్ చేస్తున్నారని చెప్తున్నారు.
సానియా – మాలిక్ ల విడాకులు నిజమేనా..?
ఈ విషయం తెలుసుకున్న మనోజ్ అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.