తెలంగాణలో కుదిరితే టీఆర్ఎస్ అధికారంలో ఉండాలి. లేదంటే బీజేపీనైనా పవర్ లో ఉండాలని ఏపీ సీఎం కోరుకుంటారు. అది ఆయన అవసరం. ఈ రెండు పార్టీలు కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జగన్ కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం ఖాయం. అందుకే అవమానకరంగా చెల్లిని టీఆర్ఎస్ సర్కార్ అరెస్ట్ చేసిన జగన్ నోరు మెదపలేదు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నోరు తెరిస్తే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న జగన్ ఆస్తులపై విచారణ సంస్థలను రంగంలోకి దింపే ప్రమాదం ఉండటంతో కేసీఆర్ తో స్నేహాన్నే జగన్ కోరుకుంటున్నారు. ఇక, బీజేపీ విషయానికి వస్తే…విచారణ దశలోనున్న జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో కనుసైగలతో బీజేపీ జగన్ ను జైల్లో వేయించగలదు. అందుకే తన ఆస్తుల భద్రత, భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా టీఆర్ఎస్ , బీజేపీలతో సఖ్యత మెయింటేన్ చేస్తున్నారు జగన్.
ఇకపోతే, తెలంగాణలో కాంగ్రెస్ బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా ఆ పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని టీఆర్ఎస్ , బీజేపీలకు అనుకూలంగా మార్చేందుకు జగన్ పత్రిక బాధ్యత తీసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ నేతలు హస్తం పార్టీలో ఏర్పడిన ప్రస్తుత సంక్షోభంతో మనస్తాపం చెందారని రాసుకొచ్చింది. వారంతా టీడీపీ అధినేతతో టచ్ లో ఉన్నారని.. టీడీపీలో చేరేందుకు సిద్డమయ్యారని పేర్కొంది. రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ లో చేరిన నేతలు..తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. రేవంత్ రెడ్డిని సీఎంగా చూడాలని తలుస్తున్నారు. కాంగ్రెస్ ద్వారా మాత్రమే ఆ అవకాశం ఉంటుందని టీడీపీని వీడి కాంగ్రెస్ లోకి జంప్ చేశారు.ఇప్పుడు ఆరు నూరైనా ఆ నేతలు తిరిగి టీడీపీలోకి వెళ్ళే అవకాశం లేదు.
కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి తిరిగి వెళ్లాలనుకునే నేతలు చిన్నా చితక నేతలే తప్ప.. రేవంత్ తో సాన్నిహిత్యమున్న నేతలు కానే కాదు. కాని, జగన్ డబ్బా పత్రిక మాత్రం తెలంగాణలో కేసీఆర్ ప్రాపకం కోసం కాంగ్రెస్ ను మరింత బలహీనం చేసేందుకు టీడీపీ పేరును వాడుతూ కాంగ్రెస్ ను, మరీ ముఖ్యంగా రేవంత్ వర్గాన్ని దెబ్బతీసేందుకు వార్త కథనాలు రాసుకొచ్చింది. టీడీపీలోకి ఎల్లో కాంగ్రెస్ అంటూ నిరాధార వార్తలు వండివార్చింది. సొంత గూటికి ఎల్లో కాంగ్రెస్ అనే వార్త పూర్తిగా బీజేపీ , బీఆర్ఎస్ పార్టీలకు మేలు చేసేదే. ఈ వార్త వెనక కాంగ్రెస్ క్యాడర్ ను గందరగోళానికి గురి చేసే పన్నాగముంది. దీంతో ఆ పార్టీని పూర్తిగా బలహీనపర్చాలనేది జగన్ పత్రిక ఎత్తుగడ. తద్వారా కాంగ్రెస్ లో విబేధాలు తారాస్థాయికి చేరుకుంటాయని…దాంతో కాంగ్రెస్ నుంచి కొంతమంది నేతలు బీజేపీ, బీఆర్ఎస్ లోకి వెళ్తారని ఆ పత్రిక మేనేజ్ మెంట్ వ్యూహం.
నిజానికి , సాక్షి పత్రిక తెలంగాణలో క్రిడిబిలిటీని ఎప్పుడో కోల్పోయింది. ఆ పత్రిక పాఠకులుగా వైసీపీ సానుభూతిపరులే ఉన్నారు. దాదాపు టీఆర్ఎస్ అనుకూల పత్రిక మాదిరే సాక్షిలోనూ కథనాలు వస్తున్నాయని ఆ పత్రికను చదవడమే మానేశారు. దాంతో పత్రిక కొనసాగింపు కూడా ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలోనే పత్రిక మేనేజ్ మెంట్ రూట్ మార్చింది. అవాస్తవ కథనాలను కాస్త స్పైసీగా పాఠకుల మనస్సు హత్తుకునేలా వార్తలు రాస్తోంది. కాని అవన్నీ నిరాధరమైనవే కావడం గమనార్హం.