తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు మునుగోడు ఉప ఎన్నిక దారి చూపుతుందని మరీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఎమ్మెల్యే పదవికి బీజేపీ అధినాయకత్వం రాజీనామా చేయించింది. ఈ ఉప ఎన్నికను నెగ్గి తీరాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. మునుగోడులో బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ , టీఆర్ఎస్ నుంచి కమలం క్యాంప్ లోకి వలసలు భారీగా ఉంటాయని అంచనా వేసి..సాధారణ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయముందని తెలిసినా కావాలనే ఈ ఉప ఎన్నికను తీసుకొచ్చారు ఢిల్లీ పెద్దలు.
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీదే విజయమని తేలింది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని వెల్లడైంది. ఈ ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఓడితే కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ కెరియర్ ప్రమాదంలో పడినట్లే. ఓడిన నేత అని పార్టీ కూడా రాజగోపాల్ ను పట్టించుకోదు. అదే సమయంలో… వెంకట్ రెడ్డి కూడా ఆడియో లీక్ తో కష్టాలను కొనితెచ్చుకున్నారు. తన తమ్ముడికి ఒటేయండని పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారు. ఇక, పీసీసీ పీఠం తనదేనని ఆశలు పెట్టుకున్న వెంకట్ రెడ్డి ఈ ఉప ఎన్నిక ద్వారా పదవిని కూడా కాళ్ళదన్నేసుకున్నారు.
మొత్తంగా, కోమటిరెడ్డి బ్రదర్స్ తన రాజకీయ జీవితాన్ని డేంజర్ జోన్ లో పడేసుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వెంకట్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతోంది. ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఓడితే వెంకట్ రెడ్డి బీజేపీలో చేరినా ఆయన పాత్ర నామమాత్రంగానే ఉంటుందన్నది పెద్దగా చెప్పాల్సిన పని లేదు. చూడాలి.. మునుగోడు ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో..!!!