కాస్టింగ్ కౌచ్ పై మహానటి ఫేమ్ కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో ఛాన్స్ కోసం వెయిట్ చేసే హీరోయిన్స్ కు వేధింపులు నిజమేనని షాకింగ్ కామెంట్స్ చేశారు.
అదృష్టవశాత్తు ఇప్పటివరకు తనకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని, ఒకవేళ వేధింపులు ఎదురైతే ఇండస్ట్రీని వదిలేసి ఎంచక్కా జాబ్ చేసుకుంటానని స్పష్టం చేసారు కీర్తి సురేష్. అంతేకాని సినిమాలో అవకాశాల కోసమని కమిట్మెంట్ ఇవ్వనని తేల్చి చెప్పారు.
తనతోపాటు నటించిన కొంతమంది హీరోయిన్స్ , ఇతర నటులు ఎదుర్కొన్న వేధింపులను తనతో పంచుకున్నారని కీర్తి సురేష్ వివరించారు. మన ప్రవర్తనను బట్టి మనల్ని జడ్జ్ చేస్తుంటారని అందుకే బిహేవియర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మనం ఉండే విధానం బట్టి కమిట్మెంట్ అడుగుతారేమోనని అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే తనను ఎవరూ అలా అడగలేదని వివరించారు.
ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న దసరా చిత్రంలో కీర్తి సురేశ్ నటిస్తున్నారు. మెగాస్టార్ భోళాశంకర్ తో పాటు మామన్నన్, సైరన్ సినిమాల్లో నటిస్తూ కీర్తి బిజిగా ఉన్నారు.