ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల మధ్య ముందస్తు ఎన్నికలపై ఫైట్ జరుగుతుందా..? ప్రతిపక్షాలు ఏమాత్రం కుదురుకోక ముందే ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారా..? ఇప్పటికప్పుడు ఎన్నికలకు వెళ్తే అప్పనంగా కాంగ్రెస్ కు అధికారం అప్పగించడం మినహా టీఆర్ఎస్ పవర్ లోకి వచ్చే పరిస్థితి లేదని కేటీఆర్ చెబుతున్నారా..? ఇంతకీ తండ్రి కొడుకుల మదిలో ముందస్తుపై మెదులుతున్న ఆలోచన ఏంటి..?
ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేయమనండి అంటూ సీఎం కేసీఆర్ విసిరిన సవాల్ కు ప్రతిపక్షాలు కూడా స్పందించాయి. నాలుగు రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేయండి అంటూ తెలంగాణ కాంగ్రెస్ సారధి రేవంత్ రెడ్డి, ముందస్తు ఎన్నికలకు మేము సై అంటూ
బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ప్రతిస్పందించారు. కాని మళ్ళీ ప్రగతి భవన్ నుంచి సౌండ్ లేదు. తాజాగా యాక్టింగ్ సీఎం కేటీఆర్ వచ్చి ముందస్తు లేదు గిందస్తు లేదు…షెడ్యూల్ మేరకు ఎన్నికలు జరుగుతాయ్ అంటూ తేల్చేశారు. అయితే , కేటీఆర్ చేసిన ఈ ప్రకటనే రాజకీయ వర్గాల్లో చర్చనీయాశం అవుతోంది.
కేసీఆరేమో ముందస్తుకు సిద్దంగా ఉన్నామని అంటుంటే.. కేటీఆర్ మాత్రం ముందస్తు ముచ్చటే లేదని చెప్తుండటం అనేక అనుమానాలకు కారణం అవుతోంది. నానాటికీ రాష్ట్రంలో టీఆర్ఎస్ బలహీనపడుతుందని.. మెజార్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత గూడుకట్టుకుంటుందని పీకే సర్వేలో ప్రస్పుటం అయింది. దీంతో కేసీఆర్ మరికొన్ని రోజుల్లో జిల్లాల పర్యటనల తరువాత ఏ క్షణమైనా ముందస్తుపై సంచలన ప్రకటన చేయనున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే , ఈ అభిప్రాయాన్ని కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
ప్రస్తుతం పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని ఉద్యోగాల భర్తీ, కొత్త ఫించన్లు, రేషన్ కార్డులు, రుణమాఫీ పూర్తైన తరువాత షెడ్యూల్ మేరకే ఎన్నికలకు వెళ్దామని కేసీఆర్ వద్ద చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే కేటీఆర్ ను సీఎం చేస్తారన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో ఏమత్రం అజాగురకతతో వ్యవహరించిన తన సీఎం కళ అందని ద్రాక్షగా మారుతుందని ముందస్తుపై తొందరపడొద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు.. ముందస్తు ఎన్నికలపై ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వోద్దనే వ్యూహంలోభాగంగానే కేటీఆర్ ముందస్తుపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారన్న విశ్లేషణలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.