ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ కు సంబంధించిన వీడియోలను బయటపెట్టారు సీఎం కేసీఆర్. తమ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తె ఊరుకోవాలా అంటూ కేంద్రంలోని బీజేపీపై ఊగిపోయారు. ఇక బీజేపీతో జగడమేనని గంభీరంగా చెప్పారు. కాని కేసీఆర్ ను ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. ఆయనకు ఎవరూ కోరస్ కలపడం లేదు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీని నిజంగా బోనులో నిలబెట్టాలనుకుంటే కేసీఆర్ తన దగ్గరనున్న వీడియోలను పోలీసులకు, కోర్టుకు సబ్మిట్ చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాల్సింది. కాని ఆడియోలు, వీడియోలను కేసీఆర్ స్వయంగా రిలీజ్ చేయడం బీజేపీ – టీఆర్ఎస్ ల గేమ్ ప్లాన్ కు మచ్చుతునక అనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.
చార్జీషీట్ ఫైల్ అయ్యేవరకు భద్రంగా ఉంచాల్సిన సాక్షాలను ఎందుకు బహిర్గతం చేశారని హైకోర్టు ప్రశ్నించింది. అంటే, ముందస్తు ప్లాన్ లో భాగంగా ఈ కేసును నీరుగర్చేందుకు ఆ వీడియో, ఆడియోలను కేసీఆరే రిలీజ్ చేశారన్న అభిప్రాయాన్ని న్యాయకోవిదులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంకు సంబంధించిన సమాచారాన్ని దేశంలోని న్యాయమూర్తులకు, ముఖ్యమంత్రులకు పంపారు. కాని దీని వలన పెద్దగా ఒరిగెదెం ఉండదు.
ఎందుకంటే, గతంలో కేసీఆర్ కూడా నిసిగ్గుగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను సైతం అప్రజాస్వామికంగా టీఆర్ఎస్ లో చేర్చుకొని వారికీ మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. కేసీఆర్ కు అప్పుడు గుర్తుకురాని ప్రజాస్వామ్యం.. ఇప్పుడు తనదాక వస్తే గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నిస్తున్నారు.