రాజకీయాల్లో మాటలు తక్కువ..చేతలు ఎక్కువ కనిపించాలి. అధికారం ఉందన్న అహంకారం పనికిరాదు. ఎవరిని పడితే వారిని ఇష్టానుసారంగా మాట్లాడితే ఎన్నికలలో పరిణామాలు వేరేలా ఉంటాయి. పైగా చూసేవారికే రోత పడుతుంది. అసహ్యం పెరుగుతుంది. ఎందుకురా ఇలాంటి ప్రభుత్వాని ఎన్నుకున్నామన్న భావన ప్రజల్లో కలుగుతుంది. మళ్లీ ఎన్నికలు వస్తాయి..అప్పుడు ఫలితం అనుభవించక తప్పదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రవర్తన కూడా ఇప్పుడు ఇలాగే ఉంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే మంచి రాజకీయ అనుభవమున్న వ్యక్తిగా పేరుంది. ఆయన రాజకీయాల్ని తెలివిగా వాడేస్తుంటాడు. ఎక్కడ ఆవేశ పడాలో ఎక్కడ సైలెంట్ గా ఉండాలో ఆయనకు తెలిసినంతగా రాజకీయంలో మరెవ్వరికి తెలియదని చెబుతూంటారు. కానీ తెలంగాణ గవర్నర్ తమిళీ సై విషయంలో కేసీఆర్ చేసిన తప్పులు ఇప్పుడు పూర్తిగా తనదే తప్పని ఆయనే ఒప్పుకోవాల్సిన పరిస్థితికి చేరాయి. ఇన్నాళ్ళు కేసీఆర్ అవమానాలను భరించుకుంటూ వచ్చిన గవర్నర్ తమిళీ సై.. ఇప్పుడు కేసీఆర్ కు పెద్ద తల నొప్పి తెచ్చిపెట్టింది. ఇన్నాళ్ళు సర్కారుతో గవర్నర్ ఎలా ఉన్నదో కానీ ఇప్పుడు మాత్రం కెసిఆర్ తనే తప్పు చేసినట్లు కోర్టులో ఒప్పుకునే పరిస్థితికి చేజేతులా తెచ్చుకున్నారు. కనీసం గవర్నర్ కు ప్రోటో కాల్ ఇవ్వలేదు. చివరికి ఆమెను ఇబ్బంది పెట్టడానికి జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల్ని నిర్వహించలేదు. ఇక్కడ తెలంగాణ ప్రజలు చూడాల్సింది గవర్నర్ ని కాదు..ప్రజాస్వామ్యం తో కూడిన దేశాన్ని.చివరకు కేసీఆర్ బడ్జెట్ ప్రసంగాన్ని లేకుండా చేశారు. ఆమెపై కోపంతో కేసీఆర్ ఇలా వ్యహరిస్తున్నారు.
ఇన్నాళ్ళు కేసీఆర్ అవమానాలు, మంత్రుల విమర్శలను భరిస్తూ వచ్చినా గవర్నర్ ఇప్పుడు తనదైన శైలిలో కేసీఆర్, మంత్రులకు చుక్కలు చూపిస్తోంది. గవర్నర్ అవమానాలకు ప్రధాన కారకులు బీఅర్ఎస్ నేతలే అని చెప్పొచ్చు. నాయకులు ఇలా విమర్శిస్తే కేసీఆర్ పనిష్మెంట్ ఇవాల్సింది పోయి తాను సంతోషపడుతున్నారు. అదే కేసీఆర్ ను ఇరకాటంలోకి నెట్టింది. ఇదంతా అధికార మత్తులో వుండి చేయడంతో జరిగిందని చెప్పొచ్చు.
Also Read : జనాలకు అనుమతి ఇవ్వరట..సచివాలయం కాదది.. దొర గడీ..!