అభివృద్ది చెందిన అమెరికా లాంటి దేశంలో న్యూ యార్క్, వాషింగ్టన్ లాంటి మహానగారాలను ‘స్లీప్ లెస్ సిటీస్’ అంటారు. అంటే ‘నిదురలేని’ నగరాలు అని అర్థం. 24 గంటలు అన్ని షాపులు తెరిచి ఉంటాయి. ఈ వ్యాపార సముదాయాలు పగలుకు-రాత్రికి, పండగలకు-పబ్బాలకు సెలవు లేకుండా 24 గంగలు, 365 రోలులు తెరిచే ఉంటాయి. అందుకే వాళ్ళ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా అర్థిల్లుతోంది.
ఇప్పుడు ఇదే విధానన్ని కెసిఆర్ పాటిస్తూ కొత్త జి వో విడుదల చేశారు. తెలంగాణలో ఇకనుంచి 24 గంటలు వ్యాపార సముదాయాలు తెరుచుకోవచ్చు. అయితే అది కేవలం హైదరాబాద్ లాంటి మహా నగరానికే పరిమితం చేయలేదు. మొత్తం తెలంగాణకు వర్తిస్తుంది. అంటే అన్ని నగరాలు, పట్టణాలు, తాలుకాలు, 24 తెరిచే ఉంటాయి. ప్రపంచంలో ‘స్లీప్ లెస్ సిటీ’లు ఎన్నో ఉన్నాయి. కానీ ‘స్లీప్ లెస్ స్టేట్’ బహాశ తెలంగాణ ఒక్కటేనేమో? దీనివల్ల రాష్ట్రం ఆదాయం విపరీతంగా పెరుగుతుంది.
అయితే తెలంగాణ కార్మిక శాఖ దీకిని కొన్ని కొత్త నిబంధాలు విధించింది. దుకాణం 24 తెరిచి ఉంచాలి అనుకుంటే ఇందుకోసం రూ.10 వేలు అదనంగా ముసిపాల్ టాక్స్ కట్టాలి. ఉద్యోగులు షిఫ్ట్ ల వారిగా పని చేయాలి. రాత్రి పని చేసే సిబ్బందికి ఐడీ కార్డులు తప్పనిసరిగా జారీ చేయాలి. ఇప్పుడున్న కార్మిక చట్టం నిబంధనల ప్రకారం వారాంతపు సెలవు ఇవ్వాలి. వారంలో కచ్ఛితమైన 6 లేదా 8 గంగల పని గంటలు ఉండేలా చూదాలి. ఓవర్ టైంకు అదనపు స్కేల్ ఇవ్వాలి. పండగలకు – పబ్బాలకు సెలవు దినాల్లో పని చేసిన వారికి అదనపు జీతం ఇవ్వాలి. లేదంటే కాంపెన్సేటరీ సెలవు ఇవ్వాలి.
రాత్రి షిఫ్టులో పని చేసే మహిళా ఉద్యోగుల నుంచి అంగీకార పత్రం తీసుకోవాలి. ఇందులో యజమాని ఒత్తిడి ఉండరాదు. యజమాని ఉద్యోగులకు రవాణా సదుపాయం కల్పించాలి. రికార్డుల్ని సరిగ్గా నిర్వహించటంతో పాటు పోలీస్ యాక్టులోని నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి.
అయితే కొన్ని మహా నగరాల్లో 24 గంటలు ప్రభుత్వ వాహనాలు నడుస్తున్నాయి. ఇక మన దగ్గర కూడా మెట్రో రైళ్ళు, లోకల్ రైళ్ళు, బసులు 24 గంటలు నడపవలసి వస్తుంది. అప్పుడు ఉద్యోగులను మూడు షిఫ్ట్ లు పని చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడున్న ఉద్యోగాల సంఖ్యా మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే నిరుద్యోగ సమస్య తగ్గే అవకశాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి ఇది గొప్ప పునాది పడుతుంది.