బుల్లితెర ప్రారంభ రోజుల్లో బుల్లితెర మహారాణిగా ఓ వెలుగు వెలిగింది యాంకర్ ఉదయభాను. ప్రస్తుతం సుమ ఎంత బిజీగా ఉంటుందో అప్పట్లో ఉదయభాను అంతే బిజీగా ఉండేది. ఆమె అంగీకరించిన ఈవెంట్స్ కు భారీ మొత్తంలో పారితోషకం చెల్లించేవారు. అప్పట్లో ఆమె హవా అలా ఉండేది మరి.
అప్పట్లో ఉదయభాను కెరీర్ సక్సెస్ కు కేరాఫ్ గా సాగుతుండగా ఆమె జీవితంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమె పెళ్ళే ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. జనాల్లో ఉన్న ప్రచారం బట్టి.. ఆమె బుల్లితెరకు ఎంట్రీ ఇవ్వకముందే 15ఏళ్ల వయస్సులోనే ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుందని అంటుంటారు. తరువాత కొన్ని కారణాల వలన అతనితో విడిపోయింది.
ఆ తరువాత ఒంటరిగా జీవితం సాగిస్తోన్న ఉదయభాను కెరీర్ పై ఫోకస్ చేసింది. స్పెషల్ ఈవెంట్స్ కోసం… ఆమె యాంకర్ గా చేయాలంటే రోజులు తరబడి వెయిట్ చేయాల్సి ఉండేది. కొన్నిసార్లు ఆమె వలన ఈవెంట్స్ వాయిదా పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. బుల్లితెరపై ఆమె హవా అలా సాగుతుండగా విజయ్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమ మొదలైంది.
అయితే…జనాలు అనుకునేది ఏంటంటే విజయ్ కుమార్ మొదట్లో ఉదయభాను వద్ద డ్రైవర్ గా చేసేవాడని. కాదు అతను ఉదయభాను ఆఫీస్ లో జాబ్ చేసేవాడని. ఇలా రకరకాలుగా చెబుతుంటారు. ఆయన ఏం చేసేవాడో కానీ ఉదయభానుని మాత్రం ప్రేమలో పడేశాడు. వీరిద్దరి ప్రేమ విషయంలో తల్లితో గొడవ పడింది. ఆ గొడవ కారణంగా ఉదయభాను బాగా డిస్ట్రబ్ అయింది.
ఆమె ప్రేమ కారణంగానే బుల్లితెరపై ఉదయభాను సందడి తగ్గిందని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. ఆమె యొక్క నిర్ణయం సరైనదే కానీ ఆమె తల్లి ఆ సమయంలో ఆమెకు మద్దతు తెలపకపోవడం వల్ల కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎక్కడో ఉండాల్సిన ఉదయభాను ఆ డిస్ట్రబ్ వలన కొంత వెనకబడింది. ప్రస్తుతానికి ఇద్దరు పిల్లలతో ఉదయభాను చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.