అధికారం కోల్పోయాక కూడా బీఆర్ఎస్ కీలక నేతల తీరు ఏమాత్రం మారడం లేదు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చినా కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి అడుగు బయటపెట్టడం లేదు. హరీష్ రావు మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ తాను ఇంకా అధికారంలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు. ఆయన తీరు చూసి ఆయన రాజకీయ సలహాలు ఇస్తోన్న వారిని తిట్టిపోస్తున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కొనసాగుతున్నారు. ఏదీ మాట్లాడినా అది పార్టీ అధికారిక ప్రకటనే. కానీ ఇదేమి పట్టించుకోకుండా కామెంట్స్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న ఇష్యు అని కొట్టిపారేస్తున్నారు. ఒకరో, ఇద్దరో, ముగ్గురో ఫోన్ ట్యాపింగ్ చేశారని.. దానిని పెద్ద ఇష్యుగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారని ప్రశ్నించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
వస్తానికి ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద విషయం. ఎవరిదైనా ఫోన్ ట్యాప్ చేయాలంటే కేంద్రం అనుమతి ఉండాలి. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ వాటిని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డితో సహా కీలక నేతల ఫోన్లు ఫోన్లు ట్యాప్ చేసి.. కీలక సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించే వ్యూహాన్ని ముందే తెలుసుకొని కౌంటర్ ప్లాన్ చేయాలనీ అనుకున్నారు. అయితే.. ట్విస్ట్ ఏంటంటే.. హీరోయిన్స్ ఫోన్లు కూడా ట్యాప్ చేయడం. హీరోయిన్స్ ఫోన్స్ ఎందుకు ట్యాప్ చేశారన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.
ఈ విషయంలో ఒకరి తర్వాత ఒకరిని సిట్ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. ఇది కేసీఆర్ , కేటీఆర్ వరకు వచ్చే అవకాశం మెండుగా ఉంది. కారణం.. విచారణలో ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాప్ చేసినట్లుగా చెప్తున్నారు. దీంతో త్వరలోనే కేటీఆర్ కు నోటీసులు ఇష్టారాని ప్రచారం జరుగుతోన్న వేళ ఈ విషయంపై స్పందించారు. ఇది చాలా చిన్న విషయమని వ్యాఖ్యానించారంటే.. ముందు ఉన్న ప్రమాదాన్ని అంచనా వేసే.. ఏదైనా జరిగితే తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని చెప్పుకునేందుకు దీనోక వాడుకోవచ్చూనని కేటీఆర్ భావన కావొచ్చు.