ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరోయిన్ గా అలరించిన ఇలియానా అస్వస్థతకు గురైంది. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఒకరోజులో చాలా మారవచ్చు. కొంతమంది లవ్లీ డాక్టర్లు , మూడు బ్యాగుల IV ఫ్లూయిడ్స్, అంటూ తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇలియానా. ఇంతకీ ఇలియానాకు ఏమైందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ పోస్ట్ చేసిన ఇలియానా వెంటనే మరో పోస్ట్ కూడా చేసింది. నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని చాలా మంది మెసేజ్ లు చేస్తున్నారు. ఇలాంటి ప్రేమ అందరికీ సాధ్యం కాదు. ఈ ప్రేమను పొందటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను. సకాలంలో వైద్యం కంప్లీట్ అయింది. అని చెప్పుకొచ్చింది.
ఇలియానాకు ఫుడ్ పాయిజన్ అయిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఫెయిర్ అండ్ లవ్లీ అనే చిత్రంలో ఇలియానా బెబే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.