దేశంలో మెట్రో స్టేషన్లు సూసైడ్ స్పాట్లుగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న HYD ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా ఢిల్లీలోని అక్షర్ ధామ్ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి మరో యువతి సూసైడ్‌కు యత్నించింది. అప్పటికే విషయం తెలుసుకున్న CISF జవాన్లు ఆమెను కాపాడేందుకు కింద రక్షణ వలను ఏర్పాటు చేశారు. దీంతో కిందకు దూకిన యువతి స్వల్ప గాయాలతో బయటపడింది.
