మోస్ట్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ కథానాయకుడిగా తెరకెక్కిన హిట్ 2 తాజాగా రిలీజ్ అయింది. హిట్ మూవీకి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాను డైరక్టర్ శైలేష్ కొలను రూపొందించారు. ట్రైలర్, సాంగ్స్ తో హిట్ 2 పై అంచనాలను పెంచేసిన ఈ సినిమా అంచనాలను అందుకుందో లేదో రివ్యూలో చూద్దాం
స్టొరీ
కేడి అలియాస్ కృష్ణ దేవ్ ( అడివి శేష్ ) చాలా కూల్ ఆఫీసర్. ఏ కేసులనైనా ఇట్టే డీల్ చేసేయడం ఆయన స్పెషల్. అలాంటి కృష్ణదేవ్ కు సంజన అనే అమ్మాయి మర్డర్ కేసు సవాల్ గా పరిణమిస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సంజన మర్డర్ కు సంబంధించి షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఆమె హత్య వెనక ఓ సీరియల్ కిల్లర్ ఉన్నాడని కృష్ణదేవ్ తెలుసుకుంటాడు. ఇంతకీ సంజనను హత్య చేసిన కిల్లర్ ఎవరు..? అసలు సంజనను హత్య చేసేందుకు కారణం ఏంటి..?ఈ కేసు విచారణ కోసం కృష్ణదేవ్ ఎలాంటి ఛాలెంజ్ లు ఫేస్ చేశాడు..? అన్నది ఈ హిట్ 2 కథాంశం.
వైజాగ్ ఎస్పీగా అడివి శేష్ ను పరిచయం చేస్తూ ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. చాలా కూల్ గా కేసులను సాల్వ్ చేసే హీరోగా అడివి శేష్ ను పరిచయం చేస్తారు. వెంటనే హీరోకు తోడుగా హీరోయిన్ ను అధ్య ( మీనాక్షి చౌదరి) పరిచయం చేస్తాడు. కట్ చేస్తే.. వైజాగ్ లో సంజన అనే అమ్మాయి దారుణంగా మర్డర్ చేస్తాడు. ఈ కేసు విచారణలో భాగంగా అడివి శేష్ కు ఆశ్చర్యపోయే విషయాలు తెలుస్తాయి. అలా సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా మార్చేలా సినిమాను తెరకెక్కించారు. సాక్ష్యాధారాలు లేకుండా సంజనను మర్డర్ చేయడంతో నెక్స్ట్ సీన్ ఎం ఉండనుందనే ఉత్కంట రేపెలా సస్పెన్స్ మెయింటైన్ చేశాడు. చివర్లో ఇచ్చే ట్విస్ట్ అదుర్స్ అనిపిస్తుంది.
హీరోగా అడివి శేష్ ఆకట్టుకోగా.. హీరోయిన్ క్యారెక్టర్ ఇంకాస్త బెటర్ గా ఉంటె బాగుండేదేమో అనిపించేలా ఉంటుంది. పోసాని కృష్ణమురళీ, తనికెళ్ళ భరణి, కోమలి ప్రసాద్, సుహాస్ ఇలా అందరూ తమ క్యారెక్టర్ లకు న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్స్
అడివి శేష్
స్క్రీన్ ప్లే
ట్విస్ట్ లు
మైనస్ పాయింట్స్
రొటీన్ లవ్ స్టొరీ
ఫినిషింగ్ టచ్ : ఒక్క మాటలో చెప్పాలంటే ట్విస్ట్ లను అమితంగా ఇష్టపడే వారిని ఈ సినిమా సాటిస్ఫై చేస్తుంది.
రేటింగ్ : 2.5