పాలిట్రిక్స్ ఎప్పుడూ ప్రజల పక్షనా నిలిచింది. ప్రజల గొంతుకై మాట్లాడింది. అక్షరాలను సాయుధం చేసి అక్రమార్కుల గుండెల్లో దింపింది. అందుకే పాలిట్రిక్స్ పై ఎన్నో ఒత్తిళ్లు. అయినా…సవాళ్ళను ఎదుర్కొని నిలబడింది తప్పితే ఎక్కడా వెన్ను చూపలే. అందుకే తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది.
కాళేశ్వరం అవినీతిపై అక్షరాలను ఆయుధంగా మలిచి కన్నెర్ర జేసింది. ఫోన్ ట్యాపింగ్ విషయములో పెద్దల ప్రమేయాన్ని ప్రజల ముందు ఉంచింది. జర్నలిజం అంటే నిజాన్ని ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా చెప్పడమే. పాలిట్రిక్స్ అదే పని చేసింది.
2023లో కేసీఆర్ ప్రభుత్వం అధికారం కోల్పోతుందని ముందే వెల్లడించింది. పాలిట్రిక్స్ చేసిన సర్వేలు నిజం అయ్యాయి. నవంబర్ 30న వీ6 వేదికగా పాలిట్రిక్స్ సర్వే ఫలితాలను ప్రకటించాం.. సరిగ్గా అవే ఫలితాలు వచ్చాయి. నాడు పాలిట్రిక్స్ చెప్పిన సర్వే రిపోర్ట్ లను చూసి కాంగ్రెస్ కు బాకా ఊదుతుందని అనుకున్నారు..కానీ, డిసెంబర్3న ఫలితాలు చూసి పాలిట్రిక్స్ సర్వే రిపోర్ట్ నిజమైందని చెప్పుకొచ్చారు . అప్పటి వరకు పాలిట్రిక్స్ ను గుడ్డిగా వ్యతిరేకించిన వాళ్ళు సైతం ఆరోజు నుంచి అభిప్రాయాన్ని మార్చుకున్నారు.
ఎన్నికల విషయమే కాదు.. పలు విషయాల్లో పాలిట్రిక్స్ వాస్తవాలను చెప్పడం కేటీఆర్ కు నచ్చలేదు. తన పరువుకు నష్టం వాటిల్లిందని లీగల్ నోటీసులు పంపారు. ఇలాంటివి ఎన్నో న్యాయ బద్దంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు కేటీఆర్ నోటీసులను సమాధానం చెప్తాం.
అయినా..వాస్తవాలను ముందుంచే ప్రయత్నం చేస్తే ఎప్పుడు ఇలాంటి లీగల్ నోటీసులు ఇచ్చి నోరు మూయలని చూడటం..కోర్టులకు వెళ్లి స్టే లు తెచ్చుకోవడం కేటీఆర్ కు కొత్తేమి కాదు. పాలిట్రిక్స్ కు కూడా ఇలాంటి బెదిరింపులు కొత్త కాదు. అయినా…నిలబడతాం.. కల్వకుంట్ల కుటుంబం దుర్మార్గాలను బయట పెట్టె పనిలోనే ఉంటాం..
పాలిట్రిక్స్ ఎప్పుడూ ప్రజల పక్షమే..ప్రజల హితం కోసమే