ప్రజాసేవ కోసం, రక్షణ శాఖలో ఉన్నత పదవులను త్యాగం చేసిన..
కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జీవితం ఆదర్శప్రాయం..
వర్తమాన రాజకీయాలలో మద్యం వ్యాపారులు, మాఫియా నాయకులు, భూ కబ్జాదారులు, వ్యాపారవేత్తలు ప్రవేశించి రాజకీయ విలువలు దిగజారుస్తున్న ఈ పరిస్థితులలో, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు మన మధ్యలో ఉండడం మన రాష్ట్రానికి, నల్లగొండ జిల్లా కి గర్వకారణం..
దేశ రక్షణలో మూడు ప్రధాన విభాగాల అధిపతులుగా కెప్టెన్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ముగ్గురు సహాధ్యాయులు త్రివిధ దళాదిపతులు గా నియమితులయ్యారు..
- భారత సైన్యాధిపతిగా జనరల్ మనోజ్ పాండే నియమితులయ్యారు.
- భారత వైమానిక దళాధిపతి గా జనరల్ వివేక్ చౌదరి కొనసాగుతున్నారు.
- భారత నావికా దళ అధిపతిగా హరి కుమార్ వ్యవహరిస్తున్నారు.
త్రివిధ దళాల అధిపతులు ముగ్గురు కూడా, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలసి నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో విద్యాభ్యాసం చేసిన *బ్యాచ్ మేట్స్.
దేశ సరిహద్దులలో యుద్ధ విమానాల ఫైటర్ పైలెట్ గా అనేక సంవత్సరాలు పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ సరిహద్దులలో విశేష సేవలు అందించారు.
యుద్ధ విమాన ఫైటర్ పైలెట్ గా విధినిర్వహణలో, జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాపాయం నుండి తప్పించుకొని మృత్యుంజయుడు అయ్యాడు
ప్రజాసేవ కోసం, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంతటి ఉన్నత పదవులను త్యాగం చేశారో మనకు స్పష్టంగా అర్థమవుతున్నది.
రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతుల యొక్క చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నిర్వహిస్తున్న ఉన్నత పదవిని త్యాగం చేసి ప్రజాసేవ కొరకు రాజకీయాలలో ప్రవేశించాడు..
పద్మావతి రెడ్డి గారు భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలతో మమేకమై, రెండున్నర దశాబ్దాలుగా ప్రజాసేవలో, అభివృద్ధిలో, పాలుపంచుకుంటున్నారు.
తమకు సంతానం లేకపోయినప్పటికీ, కోదాడ హుజూర్నగర్ ప్రజలనే తమ పిల్లలుగా భావిస్తూ వారి అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తూ, తమ జీవితాన్ని ప్రజల కొరకు అంకితం చేస్తున్నారు..
రెండవ సారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది..
కానీ స్వల్ప కాలంలోనే జరిగిన పార్లమెంటు ఎన్నికలలో, ఉత్తమ్ నేతృత్వంలో జిల్లాలోని రెండు స్థానాలలో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది..
ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా, పార్లమెంటులో చురుకైన పాత్ర పోషిస్తూ, తనదైన శైలిలో ప్రభుత్వాన్ని నిలదీసి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాడు..
నల్లగొండ జిల్లా నుండి లోకసభకు ప్రాతినిధ్యం వహించిన గత సభ్యుల వారసత్వాన్ని కొనసాగిస్తూ, జాతీయస్థాయిలో నల్లగొండ కీర్తి పతాకాన్ని ఎగర వేస్తున్నాడు.