యాంకర్ సుమ ఇటీవల ఓ ఈవెంట్ లో తీసుకున్న నిర్ణయానికి ఒక్కసారిగా అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగి తేలారు. తాను క్యాష్ షో లో బిజీ షెడ్యూల్ ఉండడం వలన సరిగా కుటుంబ సభ్యులతో గడపలేకపోతున్నట్లు వాపోయింది. ఇక నుంచి యాంకరింగ్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీ చేసిన స్పెషల్ ఈవెంట్ లో అందరిముందు చెప్తూ కన్నీరు పెట్టుకుంది. సుమ మాటలు నమ్మిన ఆమె అభిమానులు సుమ యాంకరింగ్ ను మిస్ అవ్వుతున్నామని ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.
యాంకర్ సుమ చెప్పిన మాటలను నమ్మిన అభిమానులకు మల్లెమాల ఎంటర్టైన్ మెంట్ “సుమ అడ్డా” అనే సరికొత్త టాక్ షో ట్విస్ట్ ఇచ్చింది. క్యాష్ షో కు బదులుగా ఈ సరికొత్త కొత్త షో ను ప్రారంభించినట్లు చెప్పింది. దీనికి యాంకర్ ఎవరో కాదు సుమనే. అలీ, పోసాని, జాని మాస్టర్ తో పాటు కళ్యాణం కమనీయం టీం సుమ అడ్డా షోలో పాల్గొన్నారు. దీనిని చూసిన సుమ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. యాంకరింగ్ నుంచే దూరం అవుతున్నానని చెప్పి తమను ఏడిపించిన సుమ మరో షో చేయడం ఏంటని షాక్ అయ్యారు.
“సుమ అడ్డా” సరికొత్త టాక్ షో ప్రోమో చూసిన సుమ అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు. అభిమానుల కన్నీళ్లు అంటే అంత అలుసా అంటూ ఏకిపారేస్తున్నారు.మా ఎమోషన్ తో ఆడుకుంటావా అంటూ మండిపడుతున్నారు. యాంకరింగ్ మానేస్తున్నట్లు సుమ చెప్పడంతో నమ్మిన అభిమానులకు ఒక్కసారిగా సుమ అడ్డా అనే సరికొత్త షోను ప్రారంభించి వాళ్ళ ఏడుపుకు, ఎమోషన్ కు విలువ లేకుండా చేసింది సుమ. ఎప్పుడైనా షో లో ఇలాంటి మాటలను అభిమానులు నమ్మకూడదనేలా చేశాయి సుమ మాటలు. ఇలాంటి మాటలు కేవలం వాళ్ళ ఎపిసోడ్ పాపులర్ కోసమేనని అభిమానులుకు అర్థమైంది.
సుమ ఇచ్చిన ట్విస్ట్ తో ఇకనుంచి ఆమె నిజం చెప్పిన ఆడియన్స్ బహుశ పట్టించుకోరేమో.
Also Read : ముసలోళ్లతో శృతి హసన్ సరసాలా..!