కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాదు తిప్పిపోతల పథకం మరోసారి నిరూపణ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎగువకు ఎత్తిపోసిన నీళ్ళను తాజాగా గోదావరికి పోటెత్తిన వరదల కారణంగా ఎత్తిపోసిన నీళ్ళను మళ్ళీ దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించినా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి ఎందుకు పనికి రాకుండా పొయిందన్న విమర్శలు సర్వత్ర వెళ్ళువెత్తుతున్నాయి.
తెలంగాణలో ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు ఉండకపోవచ్చునని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దాంతో వర్షాకాలం సీజన్ ప్రారంభమైనా వరణుడు కరుణించకపోవడంతో ఈ నెల 3న కన్నెపల్లి వద్ద మోటార్లు స్టార్ట్ చేసి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ళ , సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లి వరకు కాళేశ్వరం నీటిని రివర్స్ పంపింగ్ చేశారు. మొత్తం 15రోజులపాటు 9టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. తెలంగాణ రైతాంగానికి సాగునీటిని అందించేందుకు కాళేశ్వరం నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నామని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకున్నారు.
ఇంతలో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. గోదావరి నదికి వరదలు పోతెత్తాయి. ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారడంతో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేయాల్సి వచ్చింది. దాంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసిన నీళ్ళనే మళ్ళీ దిగువకు విడుదల చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మొన్నటివరకు కోట్లు ఖర్చు చేసి మోటార్ల సహాయంతో ఎత్తిపోసిన నీళ్ళు ఇప్పుడు సముద్రం పాలు అవుతుండటంతో కాళేశ్వరం తిప్పిపోతల ప్రాజెక్టు అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Also Read : కాళేశ్వరం పంప్ హౌసుల మునక డిజైన్ వైఫల్యమే. ఇవిగో ఆధారాలు