జీడి గింజ సిగ్గు లేదా అంటే నల్లుగున్న నాకేం సిగ్గు అన్నదంట. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విషయంలో కాంట్రాక్ట్ బేరగాడు ఆర్జీ పాల్ వ్యవహరిస్తోన్న తీరు కూడా ఇలాగే ఉంది. నాపాటికి నేను పార్టీ వీడితే రేవంత్ నన్ను అన్నేసి మాటలు అంటాడా అనే ఫ్రస్టేషన్ లో తెగ ఊగిపోతు ఎదో మాట్లాడబోయి.. ఎదో మాట్లాడుతూ నవ్వులపాలైంది చాలక తాజాగా మరో కార్యం ముంగిటేసుకొని జనాల చేత ఛీ కొట్టించుకుంటున్నాడు ఆర్జీ పాల్.
ఎమ్మెల్సీ కవితకు చెందిన కంపెనీలతో అడికోర్ కంపెనీ వ్యాపార సంబంధాలు కలిగి ఉండటంపై ఆర్జీ పాల్ ఎత్తిచూపారు. ఎందుకంటే ఈ అడికోర్ కంపెనీ మొదటి డైరక్టర్ గానున్నది రేవంత్ కాబట్టి. అయితే, రేవంత్ రెడ్డి ఎక్కడ దొరుకుతాడా ఎక్కడ బుక్ చేద్దామా అనే ఆవేశంలో వాస్తవాలకు ముసుగు తొడుగుతున్నాడు ఆర్జీ పాల్. ఇందులో భాగంగా వెంటనే ప్రగతి భవన్ – గాంధీ భవన్ భాయ్ భాయ్ అంటూ ట్వీట్ చేశాడు.
రేవంత్ రెడ్డి డైరక్టర్ గా నెలకొల్పబడిన అడికోర్ కంపెనీతో కవిత కంపెనీకి బిజినెస్ రిలేషన్స్ ఉన్నాయంటూ ఆయన ట్వీట్ సారాంశం. కాని ఈ కంపెనీ ప్రారంభించిన కొద్ది నెలలకే కంపెనీ డైరక్టర్ గా రేవంత్ తప్పుకున్నాడు. కవితకు చెందిన కంపెనీలతో వ్యాపార సంబంధాలు నిరాకరించే అడికోర్ డైరక్టర్ బాధ్యతలకు 15-02-2010లోనే రాజీనామా చేసిండు రేవంత్.
( ఇందుకు సంబంధించిన ఆధారాలను పైన చూడవచ్చు )ఇక, ఆ కంపెనీ బాధ్యతల నుంచి పూర్తిగా వైదిలొగినప్పటికీ ఇంకా ఆ కంపెనీ వ్యవహారాలను రేవంత్ కు అంటకట్టడం ఆర్జీ పాల్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం.
ఇటీవల కూడా రేవంత్ రెడ్డిపై ఆర్జీ పాల్ వేసిన చేసిన ట్వీట్ వ్యూహం బెడిసికొట్టింది. ఆయన చేసిన నిరాధారమైన ట్వీట్ కు పార్టీ నేతలెవరూ కోరస్ ఇవ్వలేదు. TRS , బీజేపీలకు పక్కలో బల్లెంలా తయారైన రేవంత్ ను ఏ చిన్న అవకాశం వచ్చినా ఇరికించడానికి అటు TRS , బీజేపీ పార్టీలు కాచుకుచ్చున్నాయి. మరి, కవిత కంపెనీలతో రేవంత్ కు వ్యాపార సంబంధాలు ఉంటే బీజేపీ అగ్రనాయకత్వం విడిచిపెడుతుందా..? తమ మిత్రపక్షాలను ఎగదోయదు..!
ప్రగతి భవన్ – గాంధీ భవన్ భాయ్ భాయ్ అని ట్వీట్ చేసిన ఆర్జీ పాల్ ఎంత అవివేకో ఈ ట్వీట్ అద్దం పడుతుంది. ప్రగతి భవన్ తో రహస్య రాజకీయాలు నడుపుతూ కల్వకుంట్ల ఆర్థిక దోపిడీ కి ఊతమిస్తున్న RG Paul, గడీల పాలనను గద్దె దించేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్న నేత పై విమర్శలా..?
కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఏం అయిందని స్వయానా కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యలు చేసినా విచారణ జరగని దుస్థితి ఉందంటే నీ పార్టీకి ప్రగతి భవన్ తో రహస్య ఒప్పందం లేదని ఎలా నమ్మాలి..?
లిక్కర్ స్కాం లో నీ పార్టీ ఎంపీ ఎమ్మెల్సీ కవిత పై ఆరోపణలు చేస్తే ఇంకా ఎందుకు విచారణ జరగడం లేదో నీకు కాంట్రాక్ట్ ఇచ్చిన అమిత్ షా ను అడుగు గోపాలా..?
లేక ఆధారాలన్నీ పక్కాగా ఉన్నా విచారణకు ఆదేశించకుండా ఉండిపోయిన అమిత్ షా పెద్ద దద్దమ్మ కేంద్ర మంత్రి అని చెప్పదల్చుకున్నావా…?
గతంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల సమయంలో నీ పార్టీకి టీఆరెఎస్ మద్దతు పలికింది వాస్తవం కాదా..? నోట్ల రద్దు, జీఎస్టీ, రైతు వ్యతిరేక చట్టాల విషయంలో కేంద్ర సర్కార్ కు నీ చీకటి మిత్రుడు చీర్స్ కొట్టిందా నిజం కాదా..? ఇవన్నీ దాచేస్తే దాగని నగ్న సత్యాలు ఆర్జీ పాల్..అందరూ నీలాగా ఒకరటింకర ఉంటారని అనుకుంటున్నా ఎంది..?