కాంగ్రెస్ పై అభిమానం చంపుకోలేకపోతున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఆయన కావాలనే కాంగ్రెస్ పై సానుభూతి వ్యాఖ్యలు చేస్తున్నారా..? అనే సందేహం అందరిలో కల్గుతుంది. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ…ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర కళను సాకారం చేసిన కాంగ్రెస్ కు అధికారం అప్పగించలేదని బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఈటల హస్తం పార్టీపై సానుభూతి వ్యాఖ్యలు చేయడం పొలిటికల్ సర్కిల్లో చర్చనీయంశంగా మారింది.
అసలే బీజేపీలో వర్గపోరుతో సతమతం అవుతున్నారు ఈటల రాజేందర్. బండి సంజయ్ కూడా వైఖరి ఆయనకు మింగుడు పడక సాధారణ కార్యకర్త వలె నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాల్సిన సిట్యుయేషన్ ఏర్పడింది. పైగా..తన భావజాలానికి పూర్తి వ్యతిరేకమైన బీజేపీలో చేరడం కొన్ని అనివార్య కారణాల వలెనే జరిగిందనేది ఓపెన్ సీక్రెట్. ఈ క్రమంలోనే ఈటలపై కాషాయ క్యాంప్ లో ఆర్ఎస్ఎస్ వాదులు ఆయనపై ఓ కన్నేసి ఉంచారన్న వాదనలు కూడా ఉన్నాయి. ఆయనను చేరికల కమిటీ చైర్మన్ గా నియమించినా ఈటలను కాదని… బండి సంజయ్ ఏకపక్షంగా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో తనకు అవమానంగా భావిస్తున్నారు ఈటల.
పొద్దున్న లేస్తే ఆత్మగౌరవంపై తనకు మాత్రమే అన్ని హక్కులు ఉన్నాయన్నట్లు మాట్లాడే ఈటల… ఇన్ని అవమానాల మధ్య బీజేపీలో ఎన్నాళ్ళు ఇమడగలరన్న సందేహం అందరి మదిలో తలేతుత్తుంది. ఈ క్రమంలోనే ఆయన హస్తం పార్టీ వైపు తొంగిచూస్తున్నరన్న వాదనలు హుజురాబాద్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నికల నాటికీ ఆయన హస్తం పార్టీ కండువా కప్పుకోవడం ఖాయమని…ఇందులో భాగంగానే ఈటల ముందస్తుగా కాంగ్రెస్ పై సానుభూతి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.