పశ్చిమ బెంగాల్ లో అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సిద్దం అవుతోంది. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువెందు అధికారిని మమతా బెనర్జీపై బరిలో నిలిపినట్లుగానే.. తెలంగాణలో టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఈటలను కేసీఆర్ పై పోటీలో నిలపాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఈటలకు హైకమాండ్ బ్లూ ప్రింట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ పై పోటీ చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేసినా ఆలేరు నుంచి బరిలో నిలిచినా అక్కడే నుంచే పోటీలో ఉంటానని ఈటల చెప్పారు.కేసీఆర్ ను డీకొట్టాలంటే అందుకు సరైన ప్రత్యర్ధి ఈటలనేనని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. ఈమేరకు ఈటలకు సంకేతాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీ వెళ్ళిన ఆయన కొన్నిరోజులు అక్కడే మకాం వేసి కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలపై చర్చ జరిగినట్లు సమాచారం. కేసీఆర్ ను ఓడించేందుకు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే దానిపై ఈటలకు అధినాయకత్వం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
Also Read : గులాబీ అధిపతికి మూడినట్లేనా – కేసీఆర్ నెత్తిన మరో పిడుగు
కేసీఆర్ గజ్వేల్ నుంచే పోటీ చేస్తారని భావిస్తోన్న బీజేపీ.. ఇందుకోసం ఈటల తో వర్క్ షురూ చేయించింది. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఈటలకు ఏర్పడిన పరిచయాలతో గజ్వేల్ లో టీఆర్ఎస్ క్యాడర్ ను ఆకర్షిస్తున్నారు. గజ్వేల్ పర్యటనకు ఆహ్వానం రాగానే రెక్కలు కట్టుకొని మరీ అక్కడ వాలిపోతు… కేసీఆర్ కు గట్టి పోటీనిచ్చేందుకు ఈటల గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.
కేసీఆర్, ఈటల మధ్య గజ్వేల్ పోటీ జరిగితే పొలిటికల్ సిట్యూయేషన్ మారిపోతుంది. కేసీఆర్ అన్యాయాలను ఎదురించి నిలబడినందుకే తనను మంత్రిపదవి నుంచి తీసేశారని గజ్వేల్ ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారని ప్రజల మెప్పును పొందాలని చూస్తున్నారు. పైగా కేసీఆర్ అవినీతికి సంబంధించిన విషయాలపై ఈటలకు అవగాహనా ఉన్న దృష్ట్యా ఆయను ఓడించేందుకు ఈటలే సరైన క్యాండిడేట్ అని బీజేపీ భావిస్తోంది.